మీరు నమ్మడానికే!
“మరియు అనేకమైన యితర సూచకక్రియలను యేసు తన శిష్యులయెదుట చేసెను; అవి యీ గ్రంథమందు వ్రాయబడియుండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను”. (యోహాను 20:30-31)
సంఘంలో పెరిగిన మనకు మరియు నిద్రలో కూడా మన విశ్వాసం యొక్క గొప్ప సిద్ధాంతాలను పఠించగలిగి, అపొస్తలుల విశ్వాసాన్ని సునాయాసంగా వివరించే మనము, ఎవరి ద్వారా సమస్తము సృష్టించబడిందో, ఎవరు తన శక్తిగల మాట ద్వారా విశ్వాన్ని నిర్వహిస్తున్నారో, నిత్యత్వం నుండి తండ్రి ద్వారా జన్మించిన, దేవుని మహిమను ప్రతిబింబిస్తున్న, దేవుని యొక్క ప్రతిరూపమైన, ఆ దేవుని కుమారుని యందు విస్మయమును, భయమును, ఆశ్చర్యమును, అద్భుతమును మరోసారి అనుభవించేలా మనకు సహాయం చేయడానికి ఏదైనా చేయాలి అని నేను చాలా బలంగా భావిస్తున్నాను.
ఇప్పటివరకు వ్రాసిన అనేక అబ్బురపరిచే కథలను, అనేక మిస్టరీ థ్రిల్లర్‌లను, అనేక దెయ్యం కథలను మీరు చదవి ఉండవచ్చు. అయితే ఆశ్చర్యపరిచే, కొత్తగా అనిపించే, విచిత్రంగా అనిపించే మరియు మాటలు లేకుండా చేసే దేవుని కుమారుని అవతారం లాంటి కథను మీరు ఎన్నటికీ కనుగొనలేరు.
మనం ఎంత చచ్చిన వారి వలె ఉన్నాం! దేవా, నీ మహిమకు మరియు నీ కథకు ఎంత అనుభూతి చెందని వారీగా ఉన్నాం! నేను ఎన్నోసార్లు పశ్చాత్తాపపడి ఇలా చెప్పవలసి వచ్చింది, “దేవా, మీ స్వంత నిజమైన కథ కంటే మనుష్యులు సృష్టించిన కథలు నా భావోద్వేగాలను, నా విస్మయాన్ని మరియు ఆశ్చర్యాన్ని మరియు ప్రశంసలను మరియు ఆనందాన్ని ఎక్కువగా రేకెత్తించినందుకు నన్ను క్షమించండి.
బహుశా మన కాలంలోని గెలాక్సీలకి సంబంధించిన చలనచిత్ర థ్రిల్లర్‌లు మనకు కనీసం ఈ మేలైతే చేస్తాయి: అవి మనలను వినయంగా ఉంచి పశ్చాత్తాపానికి నడిపించగలవు. ఎందుకంటే వింతలు, విస్మయాలు మరియు ఆశ్చర్యానికి స్పందించే శక్తి మనలో ఇంకా ఉంది అని రుజువు చేస్తాయి. మనము శాశ్వతమైన దేవుణ్ణి మరియు క్రీస్తు యొక్క విశ్వ మహిమను మరియు నజరేయుడైన యేసులో వారికి మరియు మనకు మధ్య ఉన్న జీవము గల నిజమైన సంబంధాన్ని గురించి లోతుగా ఆలోచించినప్పుడు నిజంగా చాలా ప్రత్యేకమైన అనుభూతి పొందుకుంటాం.
“ఇందు నిమిత్తమే యీ లోకమునకు వచ్చితిని” (యోహాను 18:37) అని యేసు చెప్పిన మాట, మీరు చదివే సైన్స్ ఫిక్షన్‌లోని చిత్ర విచిత్రమైన కధ వలె ఉంది.
దేవుని యొక్క అనూహ్యమైన సత్యమునకు నన్ను మేలుకొలిపేలా పరిశుద్ధాత్మ భయంకరంగా నా అనుభవంలోకి ప్రవేశించాలని, తద్వారా నాపై మరియు మీపై దేవుని ఆత్మ ప్రభావం చూపాలని నేను ఎంతలా ప్రార్థిస్తున్నానో!
ఒక రోజు సూర్యోదయం నుండి సూర్యాస్తమం వరకు ఆకాశం మెరుపులుతో నిండిపోతుంది మరియు మనుష్యకుమారుడు తన శక్తివంతమైన దేవదూతలతో మండుతున్న అగ్నిలో మేఘాలలో కనిపించబోతున్నాడు. మనము ఆయనని స్పష్టంగా చూస్తాము. భయాందోళనల వలనైనా లేదా పూర్తి ఉత్సాహం నుండి అయినా, మనం వణుకుతాము మరియు అప్పుడు ఎంతకాలం ఇంత సుతిమెత్తని, హానికరం కాని క్రీస్తుతో జీవించామా అని ఆశ్చర్యపోతాము.యేసు క్రీస్తు ప్రపంచంలోకి వచ్చిన దేవుని కుమారుడని మనం నమ్మడానికి – నమ్మి మనం ఆశ్చర్య పోవడానికి మరియు మేల్కొల్పబడడానికి ఈ విషయాలు వ్రాయబడ్డాయి – మొత్తం బైబిల్ వ్రాయబడింది.
జాన్ పైపర్
జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.
సంబంధిత ధ్యానాలు...
ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది
సంస్కరణ
"సంస్కరణ" వాట్సాప్ ఛానెల్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఫేస్బుక్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఇన్స్టాగ్రామ్
క్లిక్ చెయ్యండి👆🏿
చిరునామా:
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్:
9866436426, 9958799659, 9151519121
ఇమెయిల్:
samskarana2024@gmail.com
©Samskarana – Made with❤️by ABNY Web