మన శత్రువులను మనమెందుకు ప్రేమించాలి?
“మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించువారికి మేలుచేయుడి”. (లూకా 6:27)
క్రైస్తవులు తమ శత్రువులను ప్రేమించి, వారికి మేలు చేయాలనడానికి రెండు ముఖ్య కారణాలున్నాయి.
అందులో ఒకటి దేవుడు ఏమైయున్నాడనే విషయాన్ని తెలియజేస్తుంది. దేవుడు కరుణామయుడు.
- ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతుల మీదను, అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. (మత్తయి 5:45)
- మన పాపములనుబట్టి మనకు ప్రతికారము చేయలేదు, మన దోషములనుబట్టి మనకు ప్రతిఫలమియ్యలేదు. (కీర్తన 103:10)
- ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. (ఎఫెసీ 4:32)
అందుచేత, క్రైస్తవులు ఈ పై వచనాల ప్రకారం జీవించినప్పుడు, దేవుని శక్తి ద్వారా దేవుడు ఎలా ఉంటాడో మనం చూపిస్తాం.
రెండవ కారణం ఏంటంటే క్రైస్తవుల హృదయాలు దేవునితో సంతృప్తి చెంది ఉన్నాయి, ఆ హృదయాలు పగ తీర్చుకోవడానికో, ఘనత కోసమో, డబ్బు కోసమో, భూ సంబంధమైన భద్రత కోసమో పరుగెత్తవు.
దేవుడే మనల్ని తృప్తి పరిచే నిధిగా మారాడు కాబట్టి మనకున్న అవసరాన్నిబట్టో, అభద్రతా భావాన్నిబట్టో మన శత్రువులపట్ల నడుచుకోము గాని తృప్తి పరిచే దేవుని మహిమనుబట్టి నడుచుకుంటాం.
“ఏలాగనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి, మీకు మరి శ్రేప్ఠమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యమున్నదని యెరిగి, మీ ఆస్తి కోలుపోవుటకు [అంటే, మీ శత్రువులపట్ల ప్రతీకారాన్ని తీర్చుకోలేదు] సంతోషముగా ఒప్పుకొంటిరి” (హెబ్రీ 10:34). ప్రతీకారాన్ని తీర్చుకోవడం నుండి తప్పించేది ఏంటంటే ఈ ప్రపంచం మన ఇల్లు కాదని, దేవుడే అన్నిటిని సంతృప్తి పరిచే ప్రతిఫలాన్ని ఇస్తాడని మనకుండే ప్రగాఢమైన నిశ్చయతే. మనకు “శ్రేష్టమైన స్థిరమైన స్వాస్థ్యము” ఉందని మనకు తెలుసు.
కాబట్టి, మన శత్రువులను ప్రేమించడం కోసం ఈ రెండు కారణాలలో దేవుడు నిజంగా కరుణామయుడని, ఆయన అన్నిటిని తృప్తి పరిచే మహిమాన్వితుడనే ముఖ్య విషయాన్ని మనం చూపిస్తాం.
మనపట్ల దేవుడు చూపే కరుణతో మనం సంతృప్తి చెందామన్నదే కరుణ కలిగి ఉండటానికిగల శక్తియైయున్నది. కరుణ కలిగి ఉండటానికిగల అంతిమ కారణం ఏంటంటే దేవుణ్ణి మహిమపరచడమే, అంటే ఆయన కరుణ కోసం ఆయనను మహిమపరచడానికి ఇతరులకు సహాయం చేయడమే. దేవుడు మహిమాన్వితుడని మనం చూపించాలి. దేవుని కరుణ ద్వారా, మనుష్యుల దృష్టిలో దేవుణ్ణి గొప్పవానిగా చేయడానికి మన ప్రేమ మనకు కావాలి.
జాన్ పైపర్
జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.
సంబంధిత ధ్యానాలు...
ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది
సంస్కరణ
"సంస్కరణ" వాట్సాప్ ఛానెల్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఫేస్బుక్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఇన్స్టాగ్రామ్
క్లిక్ చెయ్యండి👆🏿
చిరునామా:
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్:
9866436426, 9958799659, 9151519121
ఇమెయిల్:
samskarana2024@gmail.com
©Samskarana – Made with❤️by ABNY Web