మనమెందుకు మన నిరీక్షణను చేపట్టాలి

షేర్ చెయ్యండి:

“ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైనవారికి మరి నిశ్చయముగా కనుపరచవలెనని ఉద్దేశించినవాడై, తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన రెండు సంగతులనుబట్టి, మనయెదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను.” (హెబ్రీ 6:17-18)

పౌలు గారి మీద దాడి చేసేంతవరకు ఏమి తినము అని వాగ్దానం చేసిన ఆకలిగొన్న వారి పరిస్థితి ఏమిటి?

దేవుడు అస్థిరుడు కాదు. మనలను కొన్ని విషయాలలో పాక్షికంగా భద్రపరచి, మరికొన్ని విషయాలలో పట్టిపట్టరానట్లుగా ఉండడానికి దేవుడు వాగ్దానాలను, ప్రమాణాలను చేయడు మరియ తన కుమారుని రక్తాన్ని పణంగా అర్పించడు.

యేసు తన రక్తం ద్వారా సంపాదించిన రక్షణ సంపూర్ణమైనది, ఆ రక్షణ తన ప్రజలను రక్షించడానికి కొన్ని విషయాలలోనే కాకుండా, సమస్త విషయలాలో కావాల్సిన ప్రతిదానిని అందిస్తుంది.

అందుచేత, మనకు కలిగిన నిరీక్షణను చేపట్టాలని (హెబ్రీ 6:18) ఈ గ్రంథకర్త మనల్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నాడు? అనేటువంటి ప్రశ్నను మనం అడిగే అవకాశం ఉంది. మనం చేపట్టడమనేది యేసు రక్తం ద్వారా పొందుకొని, మార్చలేని విధంగా భద్రం చేయబడినట్లయితే (అంటే, క్రొత్త నిబంధనకు మరియు పాత నిబంధనకు మధ్యనుండే వ్యత్యాసం అదే కదా), చేపట్టాలని దేవుడు మనకు ఎందుకు చెప్తున్నాడు?

ఆ ప్రశ్నకు జవాబు ఇక్కడుంది:

  • యేసు చనిపోయినప్పుడు, చేపట్టుటను విరమించుకోవడానికి స్వాతంత్ర్యాన్ని కొనిపెట్టలేదు గాని చేపట్టడానికి కావాల్సిన శక్తిని ఆయన కొన్నాడు.
  • మనం చేపట్టనవసరం లేదన్నట్లుగా మన ఇష్టాలను రద్దు చేసుకోవడాన్ని ఆయన కొనిపెట్టలేదు గాని మనం చేపట్టడానికి మన ఇష్టాలకు ఊతనివ్వడాన్ని ఆయన కొన్నాడు.
  • చేపట్టాలన్న ఆజ్ఞను రద్దు చేయడాన్ని ఆయన కొనలేదు గాని చేపట్టాలని ఇవ్వబడిన ఆజ్ఞను నెరవేర్చడాన్ని ఆయన కొన్నాడు.
  • హెచ్చరికకు ముగింపు పలకడాన్ని ఆయన కొనలేదు గాని హెచ్చరికను విజయవంతం చేయడాన్ని ఆయన కొన్నాడు.  

“ఇదివరకే నేను గెలిచితిననియైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితిననియైనను నేను అనుకొనుటలేదు గాని, నేను దేనినిమిత్తము క్రీస్తు యేసుచేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరుగెత్తుచున్నాను” అని ఫిలిప్పీ 3:12 వచనంలో పౌలు చేసిన దానిని మీరు కూడా చేయాలన్న ఉద్దేశంతోనే యేసు క్రీస్తు చనిపోయాడు. ఇది వెర్రితనం కాదు గాని ఇది సువార్త, ఇది ఒక పాపి దేవునిలో నిరీక్షణ ఉంచునట్లు క్రీస్తు మాత్రమే ఆ పనిని బలపరచడానికి చేయగలిగిన దానిని చేయమని ఆ పాపికి చెప్పడమైయున్నది.

అందుచేత, మీరు వెళ్లి, క్రీస్తు ద్వారా మీరు పొందుకున్న దానిని చేపట్టండి, ఆయన మీలో బలంగా పని చేస్తున్నంతగా మీకున్న బలమంతటితో దానిని చేపట్టండని నా హృదయపూర్వకంగా మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...