కావున మేము అధైర్యపడము; మా బాహ్య పురుషుడు కృశించుచున్నను, ఆంతర్యపురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైనవాటిని చూడక అదృశ్యమైనవాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు; అదృశ్యమైనవి నిత్యములు. (2 కొరి౦థీ 4:16-18)
పౌలు మునుపు చూసినట్లుగా చూడలేడు (మరియు కంటద్దాలు లేవు). అతను మునుపు వినినట్లుగా వినలేడు (వినికిడి పరికరాలు లేవు). అతను మునుపు పొందిన దెబ్బల నుండి కోలుకోలేదు (యాంటీబయాటిక్స్ లేవు). మునుపు పట్టణం నుండి మరొక పట్టణానికి నడిచేటువంటి బలం అతనికి లేదు. అతని ముఖంలో, మెడలో ముడతలను చూస్తున్నాడు. అతని జ్ఞాపకశక్తి అంత బాగోలేదు. ఇదే తన విశ్వాసానికి, ఆనందానికి, ధైర్యానికి ముప్పు అని అతను అంగీకరించాడు.
అయినా, అతను ధైర్యం కోల్పోలేదు. ఎందుకు?
అతని అంతరంగ పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు గనుక అతను ధైర్యం కోల్పోలేదు. ఇదంతా ఎలా?
నూతనపరచబడే అతని అంతరంగ హృదయం, ఎక్కడో తెలియని అతను చూడలేనటువంటి అదృశ్యమైనవాటి దగ్గర నుండి వస్తోంది.
క్షణమాత్రముండు మా చులకని శ్రమ మాకొరకు అంత కంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు; అదృశ్యమైనవి నిత్యములు. (2 కొరింథీ 4:18)
ధైర్యం కోల్పోకుండ ఉండటానికి ఇదే పౌలు విధానం: ఆయన చూడలేనివాటిని చూడడం. అలాంటప్పుడు, అతను చూసినప్పుడు ఏమి చూశాడు?
ఆ తర్వాత వచ్చే 2 కొరింథీ 5:6 వచనంలో, “వెలి చూపువలన కాక విశ్వాసమువలననే నడుచుకొనుచున్నాము” అని పౌలు చెప్పాడు. అక్కడ ఉన్నదానికి ఆధారాలు లేకుండా అతను చీకట్లోకి దూకాడని కాదు గాని ప్రస్తుతానికి ప్రపంచంలోని అత్యంత విలువైన మరియు ముఖ్యమైన వాస్తవాలు మన భౌతిక ఇంద్రియాలకు అతీతమైనవిగా ఉన్నాయని అర్థం.
సువార్త ద్వారా మనం అదృశ్యమైనవాటిని “చూస్తున్నాం.” క్రీస్తును ముఖాముఖిగా చూసినవారి సాక్ష్యంలో మనం చూసే కంటికి కనిపించని నిష్పాక్షిక సత్యము మీద మనం దృష్టి పెట్టడం ద్వారా మనం మన హృదయాలను బలపరచుకుంటున్నాం, మనకున్న ధైర్యాన్ని పునరుజ్జీవింపజేసుకుంటున్నాం.
“అంధకారములోనుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసు క్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. గనుక మేము మమ్మునుగూర్చి ప్రకటించు కొనుటలేదు గాని, క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు, మమ్మునుగూర్చి, యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము” (2 కొరింథీ 4:6). “దేవుని మహిమను గూర్చిన జ్ఞానము యేసు క్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను.” సువార్త ద్వారా మన హృదయంలో దేవుని మహిమను గురించిన జ్ఞానము ప్రకాశించబడుటను మనం చూస్తాం.
ఇది మనకు అర్థం అయినా, అర్థం కాకపోయినా ఇది జరిగినప్పుడే మనం క్రైస్తవులుగా మార్పు చెందాం. పౌలుతో కలిసి మన౦ హృదయపు కళ్ళతో చూస్తూనే ఉ౦డాలి, తద్వారా మన౦ ధైర్యాన్ని కోల్పోం.