మీరు లైంగిక పాపాలకు ఎందుకు లొంగిపోతున్నారు?

మీరు లైంగిక పాపాలకు ఎందుకు లొంగిపోతున్నారు?

షేర్ చెయ్యండి:

“ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము అప్పుడు నీవు విరిచిన యెముకలు హర్షించును…. నీ రక్షణానందము నాకు మరల పుట్టించుము సమ్మతిగల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము”. (కీర్తన 51:8, 12)

లైంగిక పాపం ఆపివేయమని దావీదు ఎందుకు కేకలు వేయడం లేదు? ఈ విషయంలో పురుషులు తనను లెక్క అడిగేవారుగా చేయమని ఎందుకు ప్రార్థించడం లేదు? అతను తన చూపుల నియంత్రణ కోసం మరియు లైంగిక-రహిత ఆలోచనల కోసం ఎందుకు ప్రార్థించడం లేదు? బెత్షెబాపై అత్యాచారం చేసిన తర్వాత రచించిన ఒప్పుకోలు మరియు పశ్చాత్తాప కీర్తనలో, దావీదు అలా ప్రార్థన చేసి ఉండాల్సిందని మీరు ఆశించి ఉండవచ్చు. కాని అలా చేయలేదు.

కారణం ఏమిటంటే, లైంగిక పాపం బయటకు కనబడే ఒక లక్షణం మాత్రమే కానీ వ్యాధి కాదు అని అతనికి తెలుసు.

క్రీస్తులో పరిపూర్ణ ఆనందం మరియు సంతోషం లేవు గనుక ప్రజలు లైంగిక పాపాలకి లొంగిపోతున్నారు. వారి ఆత్మలు నిలకడగా, దృఢంగా మరియు స్థిరంగా లేవు. వారు అల్లాడిపోతారు. వారు ప్రలోభాలకు లోనవుతారు, మరియు వారి భావాలు మరియు ఆలోచనలలో దేవునికి ఇవ్వాల్సిన అత్యున్నత స్థానాన్ని ఇవ్వనందుకు వారు మిగతా వాటికి లొంగిపోతున్నారు.

ఈ విషయాలు దావీదుకు తెలుసు. మన విషయంలో కూడా ఇది నిజం. లైంగికంగా పాపం చేసేవారికి నిజమైన అవసరం ఏమిటో దావీదు తన ప్రార్థన ద్వారా మనకు చూపిస్తున్నాడు: దేవుడు! దేవునిలో ఉత్సాహ సంతోషములు.

ఇది మనకు లోతైన జ్ఞానం.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...