యేసును ఎవరు చంపారు?

యేసును ఎవరు చంపారు?

షేర్ చెయ్యండి:

“తన సొంతకుమారుని అనుగ్రహించుటకు వెనుకతీయక మన అందరికొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు?”. (రోమా 8:32)

ఇల్లినాయిస్‌లో పాస్టర్‌గా ఉండే నా స్నేహితుల్లో ఒకరు చాలా సంవత్సరాల క్రితం హోలీ వీక్ సందర్భంగా రాష్ట్ర జైలులో ఉన్న ఖైదీల గుంపుకు బోధిస్తున్నారు. తన సందేశం మద్యలో అతను ఆగి యేసును చంపింది ఎవరో తెలుసా అని వారిని అడిగాడు.

కొందరు సైనికులు చేశారన్నారు. కొందరు యూదులు చేశారన్నారు. కొందరు పిలాతు అన్నారు. నిశ్శబ్దం తరువాత, నా స్నేహితుడు అన్నాడు, “ఆయన తండ్రి ఆయన్ని చంపాడు.”

రోమా ​​8:32 మొదటి సగం ఇలా చెబుతోంది: తన సొంతకుమారుని అనుగ్రహించుటకు వెనుకతీయక మన అందరికొరకు ఆయనను అప్పగించాడు (మరణానికి). “దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యద్‌ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడ్డాడు”(అ.కా 2:23). యెషయా 53 అదే విషయాన్ని మరింత నిర్మొహమాటంగా చెబుతోంది, “దేవునివలన బాధింపబడినవానిగాను శ్రమనొందినవానిగాను మనమతనిని ఎంచితివిు . . . అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను.” (యెషయా 53:4, 10).

లేదా రోమా ​​3:26 చెప్పినట్లు, “క్రీస్తుయేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను.”అబ్రహాము తన కొడుకు ఇస్సాకు ఛాతీపై కత్తిని ఎత్తినప్పుడు, పొదలో పొట్టేలు ఉన్నందున తన కొడుకును విడిచిపెట్టినట్లు, తండ్రి అయిన దేవుడు తన కత్తిని తన సొంత కుమారుడైన యేసు ఛాతీపైకి ఎత్తాడు – కానీ ఆయనను విడిచిపెట్టలేదు ఎందుకంటే ఆయనే ఆ పొట్టేలు; ఆయనే ప్రత్యామ్నాయం.

తన సొంతకుమారుని అనుగ్రహించుటకు వెనుకతీయకలేదు, ఎందుకంటే అతను మనలను విడిచిపెట్టి కూడా ఆయన న్యాయమైన మరియు పవిత్రమైన దేవుడిగా ఉండగల ఏకైక మార్గం ఇదే. మన అతిక్రమణల అపరాధం, మన దోషాల శిక్ష, మన పాపం యొక్క శాపం మనల్ని తప్పించుకోలేనంతగా నరక నాశనానికి తీసుకువచ్చి ఉండేవి. కానీ దేవుడు తన స్వంత కుమారుని విడిచిపెట్టలేదు; మన అతిక్రమణల నిమిత్తము పొడుచుటకును, మన దోషములనుబట్టి నలిపివేయబడుటకును, మన పాపముల కొరకు సిలువవేయబడుటకును ఆయనను అప్పగించెను.

ఈ వచనం — రోమా ​​8:32 — నాకు బైబిల్‌లో అత్యంత విలువైన వాక్యం, ఎందుకంటే దేవుని భవిష్యత్తు కృప గురించిన సర్వసమగ్ర వాగ్దానానికి పునాది ఏమిటంటే, దేవుని కుమారుడు నా శిక్షలన్నీ, నా నేరాలన్నీ, నా దూషణలన్నీ, నా నిందలన్నీ, నా తప్పులన్నీ మరియు నా అవినీతి అంతా, తన శరీరంలో భరించాడు. తద్వారా నేను గొప్ప మరియు పవిత్రమైన దేవుని ముందు క్షమించబడిన, సమాధానపడిన, సమర్థించబడిన, అంగీకరించబడిన మరియు ఆయన కుడి వైపున ఎప్పటికీ చెప్పనశక్యముకాని  వాగ్దానాల లబ్దిదారుడుగా  నిలబడతాను.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...