ఎవరు అబ్రాహాము పిల్లలు?

ఎవరు అబ్రాహాము పిల్లలు?

షేర్ చెయ్యండి:

“భూమియొక్క సమస్తవంశములు నీయందు ఆశీర్వదించబడును”. (ఆదికాండము 12:3)

క్రీస్తులో నిరీక్షిణ కలిగి, విశ్వాస విధేయతతో ఆయనను అనుసరించే మీరు అబ్రహాము సంతతివారు మరియు ఆయన నిబంధన వాగ్దానాలకు వారసులు.

దేవుడు ఆదికాండము 17:3-4లో అబ్రాహాముతో ఇలా అన్నాడు, “ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసియున్నాను; నీవు అనేక జనములకు తండ్రివగుదువు.” కానీ అబ్రహాము భౌతిక లేదా రాజకీయ కోణంలో అనేక దేశాలకు జన్మనివ్వలేదని ఆదికాండము స్పష్టం చేస్తుంది. కాబట్టి, అబ్రాహాముతో శారీరకంగా సంబంధం లేనప్పటికీ, అనేక దేశాలు కుమారత్వపు ఆశీర్వాదాలను ఏదో ఒకవిధంగా అనుభవిస్తారని దేవుని వాగ్దానానికి అర్థం.

దేవుడు ఆదికాండము 12:3లో అబ్రాహాముతో, ” భూమియొక్క సమస్తవంశములు నీయందు ఆశీర్వదించబడును.” అని చెప్పినప్పుడు దీనిని అర్ధం చేసుకోవడంలో సందేహము ఏమీ లేదు. యేసుక్రీస్తు అబ్రాహాము వంశస్థుడని మరియు క్రీస్తును విశ్వసించే ప్రతి ఒక్కరు అబ్రాహాము వాగ్దానానికి వారసులవుతారని మొదటి నుండి ఆయన దృష్టిలో ఉంది. గలతీయులకు 3:29లో పౌలు ఇలా అంటున్నాడు, “మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రాహాముయొక్క సంతానమైయుండి వాగ్దాన ప్రకారము వారసులైయున్నారు.”

కాబట్టి, 4,000 సంవత్సరాల క్రితం దేవుడు అబ్రాహాముతో, “ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసియున్నాను; నీవు అనేక జనములకు తండ్రివగుదువు” అని చెప్పినప్పుడు, ఆయన మనలో ఎవరికైనా, మనం ఏ దేశానికి చెందినవారైనా,  అబ్రాహాము పిల్లలవుటకు మరియు దేవుని వాగ్దానాలకు వారసులవుటకు మార్గాన్ని తెరిచాడు. మనం చేయవలసిందల్లా అబ్రాహాము విశ్వాసాన్ని పంచుకోవడం – అంటే, దేవుని వాగ్దానాలపై మన నిరీక్షణ ఉంచడం, ఎంతగా అంటే, విధేయత అవసరమైతే, అబ్రాహాము ఇస్సాకును విడిచిపెట్టినట్లుగా మన ప్రియమైన ఆస్తిని వదులుకొనేంతనగా విధేయత చూపడం.

మనం దేవుని కోసం పని చేయడం ద్వారా కాదు గాని దేవుడు మన కోసం పని చేస్తాడని నమ్మినప్పుడు అబ్రాహాము వాగ్దానాలకు వారసులమవుతాం. “[అబ్రాహాము] దేవుని మహిమపరచి, ఆయన వాగ్దానము చేసినదానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమువలన బలమునొందెను”(రోమా 4:20-21). అందుకే అబ్రాహాము అంత అయిపోయింది అన్నప్పుడు కూడా దేవునికి లోబడగలిగాడు. అతను అసాధ్యమైనదాన్ని అంటే తన కొడుకును మృతులలో నుండి లేపగలడని దేవుణ్ణి విశ్వసించాడు.

దేవుని వాగ్దానాలపై విశ్వాసం లేదా దేవుని వాగ్దానాల యొక్క రుజువు అయిన క్రీస్తుపై విశ్వాసముంచడమే – అబ్రాహాము పిల్లలుగా మారడానికి మార్గం; విశ్వాసం నిజమైనదని చెప్పడానికి విధేయత సాక్ష్యం (ఆదికాండము 22:12-19). కాబట్టి, యోహాను 8:39లో యేసు ఇలా చెప్పాడు, “యేసు మీరు అబ్రాహాము పిల్లలైతే అబ్రాహాము చేసిన క్రియలు చేతురు.”

అబ్రాహాము పిల్లలు అన్ని దేశాలకు చెందిన ప్రజలు, వారు క్రీస్తుపై తమ నిరీక్షణను కలిగి ఉంటారు మరియు మోరియా పర్వతంపై అబ్రాహాము వలె, వారి అత్యంత విలువైన భూసంబంధమైన ఆస్తిని కోల్పోవాల్సి వచ్చినా విధేయత విషయంలో వెనక్కు తగ్గరు.

యేసుక్రీస్తుపై నిరీక్షిస్తూ, విశ్వాస విధేయతతో ఆయనను అనుసరించే మీరు అబ్రాహాము సంతతివారు మరియు ఆయన నిబంధన వాగ్దానాలకు వారసులు.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...