“నీవు నాయందు ఉంచిన ప్రేమ వారియందు ఉండునట్లును, నేను వారియందు ఉండునట్లును, వారికి నీ నామమును తెలియజేసితిని, ఇంకను తెలియ జేసెదనని చెప్పెను”. (యోహాను 17:26)  

అపరిమితమైన దానిని, పెరుగుతున్న శక్తిని, శాశ్వతమైన అభిరుచితో అత్యంత ఆనందదాయకమైనదాన్ని ఆనందించడం ఊహించుకోండి.

ఇది ఇప్పుడు మన అనుభవం కాదు. ఈ ప్రపంచంలో మన సంపూర్ణ సంతృప్తికి మూడు విషయాలు అడ్డుగా నిలబడతాయి.

1. మన హృదయాల లోతైన కోరికలను తీర్చేంత గొప్ప వ్యక్తిగత విలువ ఈ ప్రపంచంలో దేనికీ లేదు.

2. ఉత్తమమైన సంపదలను వాటి గరిష్ట విలువకు తగినట్లుగా ఆస్వాదించే శక్తి మనకు లేదు.

3. ఇక్కడున్న వస్తువులతో మన ఆనందం అంతరించిపోతుంది. ఏదీ శాశ్వతమైనది కాదు.

అయితే, యోహాను 17:26వ వచనంలో యేసు కలిగియున్న లక్ష్యం నిజమైనట్లయితే, ఇవ్వన్నీ మారిపోతాయి. “నీవు నాయందు ఉంచిన ప్రేమ వారియందు ఉండునట్లును, నేను వారియందు ఉండునట్లును, వారికి నీ నామమును తెలియజేసితిని, ఇంకను తెలియజేసెదను” అని మన గురించి ఆయన తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి పాపులను ప్రేమించినట్లుగా ఆయన తన కుమారుణ్ణి ప్రేమించడు. కుమారుడు ప్రేమకు అనంతంగా యోగ్యుడు కాబట్టి ఆయన కుమారుణ్ణి ప్రేమిస్తాడు. అంటే, కుమారుడు అనంత ప్రేమపూర్ణుడు కాబట్టి ఆయన కుమారుడిని ప్రేమిస్తున్నాడు. ఈ ప్రేమ సంపూర్ణంగా ఆనందాన్ని ఇస్తుందని అర్థం. దేవుడు తన కుమారునిలో కలిగియున్న సంతోషాన్నే కుమారునిలో మనం కూడా కలిగి ఉండాలని యేసు ప్రార్థన చేస్తున్నాడు.

కుమారునిలో ఉన్న దేవుని సంతోషమే మన సంతోషంగా మారితే, అప్పుడు మన సంతోషానికి లక్ష్యమైన యేసు వ్యక్తిగత విలువలో తరగనివాడుగ ఉంటాడు. ఆయన ఎప్పుడూ విసుగు చెందడు, నిరుత్సాహపడడు, లేక నిరాశ చెందడు. దేవుని కుమారునికంటే గొప్ప నిధి మరొకటి ఉండదు.

కానీ యేసు ప్రార్థించేది దీనికి జోడించండి; అంటే, ఈ అక్షయమైన నిధిని ఆస్వాదించే మన సామర్థ్యం-మన శక్తి, మన అభిరుచి-మానవ బలహీనతల ద్వారా పరిమితం కాదు. దేవుని కుమారుని సర్వశక్తిమంతుడైన తండ్రి ఆనందంతో మనం ఆనందిస్తాము.

దేవుని కుమారునిలో దేవుని ఆనందము మనలో ఉంటుంది మరియు అది మనకే స్వంతం. ఇది ఎప్పటికీ ముగిసిపోదు, ఎందుకంటే తండ్రికి లేదా కుమారునికి ముగింపనేది ఉండదు. ఒకరిపట్ల ఒకరికి ఉన్న వారి ప్రేమే వారిపట్ల మనకున్న ప్రేమగా ఉంటుంది, అందుచేత వారిని ప్రేమించడం అనేది ఎప్పటికీ చావదు.

జాన్ పైపర్
జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *