“సోమరి బయట సింహమున్నది వీధులలో నేను చంపబడుదుననును”. (సామెతలు 22:13)

ఈ సామెత ఇలా చెబుతుందని నేను అస్సలు ఊహించలేదు. దీనికి బదులుగా “పిరికివాడు ఇలా అంటాడు, ‘బయట సింహం ఉంది! నేను వీధుల్లో చంపబడతాను!’’ అని చెబుతుందని నేను ఊహించాను. కానీ “పిరికివాడు”కి బదులుగా “సోమరి” అని చెప్పబడింది. కాబట్టి, ఇక్కడ తనను బయటికి వెళ్ళకుండా నియంత్రించే భావోద్వేగం భయం కాదు గాని సోమరితనం.

కానీ వీధిలో సింహం వలన పొంచి ఉన్న ప్రమాదానికి సోమరితనానికి మధ్య సంబంధం ఏమిటి? “బయట సింహం ఉంది కాబట్టి ఈ మనిషి తన పని చేయడానికి చాలా సోమరిగా ఉన్నాడు” అని మనం సాధారణంగా అనము.

విషయం ఏమిటంటే, సోమరి తన పని చేయకపోవడాన్ని సమర్థించుకోవడానికి ఊహాజనిత పరిస్థితులను సృష్టిస్తాడు మరియు తద్వారా తన సోమరితనం నుండి సింహాల ప్రమాదం వైపు దృష్టిని మారుస్తాడు. అతను సోమరితనం కారణంగా రోజంతా ఇంట్లో ఉండడాన్ని ఎవరూ ఆమోదించరు. కానీ వీధిలో సింహం ఉంటే వారు క్షమించగలరు.

దీని నుండి మనం నేర్చుకోవలసిన ఒక లోతైన బైబిలు పాఠం ఏమిటంటే, మన హృదయం తనకు కావలసినదాన్ని సమర్థించుకోవడానికి మన మనస్సును దోపిడీ చేస్తుంది. అంటే, మన లోతైన కోరికలు మన మనస్సు యొక్క హేతుబద్ధమైన పనితీరుకు పైన ఉంటాయి మరియు కోరికలు తప్పుగా ఉన్నప్పటికీ వాటిని సరైనవిగా కనిపించే విధంగా గ్రహించడానికి మరియు ఆలోచించడానికి అవి మనస్సు మొగ్గు చూపేలా చేస్తాయి.

సోమరి చేస్తున్నది ఇదే. అతను పని చేయకుండా ఇంట్లోనే ఉండాలని తీవ్రంగా కోరుకుంటాడు. ఇంట్లో ఉండడానికి సరైన కారణం లేదు. కాబట్టి, అతను ఏమి చేస్తాడు? అతను తన చెడు కోరికను – తన సోమరితనాన్ని అధిగమించాడా? లేదు, అతను తన కోరికను సమర్థించుకోవడానికి అవాస్తవ పరిస్థితులను సృష్టించడానికి తన మనస్సును వాడుకుంటాడు.

యేసు “వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి” (యోహాను 3:19) అని చెప్పెను. మనము చీకటిని ప్రేమిస్తాము, కాబట్టి ఎవరికి దొరకకుండా మనకు కావలసినది చేస్తూనే ఉంటాము. అర్ధ సత్యాలు, అనుమానాలు, కుతంత్రాలు, ఎగవేతలు మరియు అబద్ధాల ఊటతో నిండి చీకటి కర్మాగారమైన మనస్సు, హృదయం యొక్క చెడు కోరికలు బహిర్గతం కాకుండా మరియు నాశనం కాకుండా ఎలాగైనా రక్షించాలి అని చూస్తుంది.

ఆలోచించండి మరియు తెలివిగా ఉండండి.

జాన్ పైపర్
జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *