నేను చింతిస్తున్నప్పుడు

షేర్ చెయ్యండి:

“ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి”. (1 పేతురు 5:7)

మీరు శోధించబడి పాపం చేయాలనుకున్న ప్రతి పాపానికి, భద్రతను తొలగించి మిమ్మల్ని చింతాక్రాంతులుగా చేసే ప్రతి విధమైన అపనమ్మకానికి సరిపోయే ఒక వాగ్దానం ఉంటుంది. ఉదాహరణకు:

నాకున్న అనారోగ్యం గురించి నేను చింతిస్తున్నప్పుడు, “నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు

వాటి అన్నిటిలోనుండి యెహోవా వానిని విడిపించును” (కీర్తన 34:19) అనే వాగ్దానాన్ని ఆధారం చేసుకొని నేను అపనమ్మకానికి విరుద్ధంగా పోరాడుతాను. 

“అంతే కాదు; శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని యెరిగి శ్రమలయందును అతిశయపడుదము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడియున్నది” (రోమా 5:3-5) అనే వాగ్దానాన్ని నేను వణుకుతూ తీసుకుంటాను.

నేను వృద్ధాప్యం గురించి చింతిస్తున్నప్పుడు, “ముదిమి వచ్చువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే తలవెండ్రుకలు నెరయువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే, నేనే చేసియున్నాను, చంకపెట్టుకొనువాడను నేనే, నిన్ను ఎత్తికొనుచు రక్షించువాడను నేనే” (యెషయా 46:4) అనే ఈ వాగ్దానాన్ని ఆధారం చేసుకొని నేను అపనమ్మకానికి విరుద్ధంగా పోరాడుతాను.

నేను చనిపోవడం గురించి చింతిస్తున్నప్పుడు, “మనలో ఎవడును తన కోసమే బ్రదుకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రదికినను ప్రభువు కోసమే బ్రదుకుచున్నాము; చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవుచున్నాము. కాబట్టి మనము బ్రదికినను చనిపోయినను ప్రభువు వారమై యున్నాము. తాను మృతులకును సజీవులకును ప్రభువై యుండుటకు ఇందు నిమిత్తమే గదా క్రీస్తు చనిపోయి మరల బ్రదికెను” (రోమా 14:7-9) అనే వాగ్దానాన్ని ఆధారం చేసుకొని నేను అపనమ్మకానికి విరుద్ధంగా పోరాడుతాను.

నా విశ్వాసపు ఓడ పగిలిపోయి, దేవునికి దూరమయ్యే పరిస్థితి గురించి నేను చింతిస్తున్నప్పుడు, “మీలో ఈ సత్‌క్రియ నారంభించినవాడు యేసుక్రీస్తు దినమువరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను” (ఫిలిప్పీ 1:6); మరియు “ఈయన తనద్వారా దేవునియొద్దకు వచ్చువారి పక్షమున, విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడైయున్నాడు” (హెబ్రీ 7:25) అనే వాగ్దానాలను ఆధారం చేసుకొని నేను అపనమ్మకానికి విరుద్ధంగా పోరాడుతాను. 

కాబట్టి, మనం ప్రజలతో యుద్దం చేయకుండా, మనకున్న అపనమ్మకంతో యుద్దం చేద్దాం. ఇదే చింతకు మూలమైయున్నది, అంతేగాకుండా, అనేకమైన ఇతర పాపాలకు కూడా మూలమైయున్నది. 

అందుచేత, శ్రేష్టమైన మరియు అతి గొప్పవైన దేవుని వాగ్దానాల మీద మనం దృష్టి పెడదాం. బైబిలు గ్రంథాన్ని చేత పట్టండి, పరిశుద్ధాత్మ సహాయాన్ని అడగండి, మీ గుండెల్లో వాగ్దానాన్ని పెట్టుకోండి, భవిష్యత్ కృపలో విశ్వాసముంచడం ద్వారా జీవించేందుకు మంచి పోరాటం పోరాడండి. 

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...