దేవుని ప్రేమ అత్యంత మధురమైనప్పుడు

దేవుని ప్రేమ అత్యంత మధురమైనప్పుడు

షేర్ చెయ్యండి:

“పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలె క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి…..వాక్యముతో ఉదకస్నానముచేత దానిని పవిత్రపరచి, పరిశుద్ధపరచుటకై దానికొరకు తన్ను తాను అప్పగించుకొనెను”. (ఎఫెసీ 5:25-27)

మీరు దేవుని నుండి షరతులు లేని ప్రేమను మాత్రమే ఆశిస్తున్నట్లయితే, మీ ఆశ గొప్పది, కానీ చాలా చిన్నది.

షరతులు లేని ప్రేమ అనేది దేవుని ప్రేమ యొక్క మధురమైన అనుభవం కాదు. “నేను నిన్ను నా కుమారునివలె చేసాను, నిన్ను చూడటం మరియు నీతో ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంది. నీవు నా మహిమతో చాలా ప్రకాశవంతంగా ఉన్నందున నీవు నాకు ఆనందంగా ఉన్నావు.” అని ఆయన ప్రేమ అంటే అది మనకు ఒక మధురమైన అనుభవం. 

మన భావోద్వేగాలు, ఎంపికలు మరియు మనం చేసే కార్యాలు దేవుడిని సంతోషపెట్టేవిగా మారుతున్న దానిమీద ఈ మధురమైన అనుభవం ఆధారపడి ఉంటుంది.

షరతులు లేని ప్రేమ అనేది షరతులతో కూడిన ప్రేమ యొక్క మాధుర్యాన్ని సాధ్యం చేసే మానవ పరివర్తనకు మూలం మరియు పునాది. దేవుడు మనలను బేషరతుగా ప్రేమించకపోతే, ఆయన ఆకర్షణీయం కాని మన  జీవితాల్లోకి చొచ్చుకుపోడు, మనలను విశ్వాసంలోకి తీసుకురాడు, క్రీస్తుతో మనలను ఏకం చేయడు, ఆయన ఆత్మను మనకు ఇవ్వడు మరియు క్రమంగా మనల్ని యేసు స్వరూప్యంలోకి మార్చడు.

కానీ ఆయన బేషరతుగా మనలను ఎన్నుకున్నప్పుడు మరియు మన కోసం చనిపోవడానికి క్రీస్తును పంపినప్పుడు మరియు మనలను క్రొత్తగా జన్మింప చేసినప్పుడు, మహిమాన్వితమైన పరివర్తన యొక్క ఆపలేని ప్రక్రియలో ఆయన మనల్ని ఉంచాడు. తన సొంత వ్యక్తిత్వానికి సరిపోయే విధంగా మనకు ఒక వైభవాన్ని ఆయన ఇస్తాడు.

మనం దీనిని ఎఫెసీ 5:25-27లో చూస్తాము. “క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి . . . పరిశుద్ధపరచుటకై. . . నిర్దోష మైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తనయెదుట దానిని నిలువబెట్టుకొనవలెనని తన్ను తాను అప్పగించుకొనెను [షరతులు లేని ప్రేమ]” — ఈ స్థితియందు ఆయన ఆనందిస్తున్నాడు.

మనం ఆవిశ్వాసులుగా పాపులుగా ఉన్నప్పుడే దేవుడు బేషరతుగా తన అనుగ్రహాన్ని మనపై ఉంచడం చెప్పలేనంత అద్భుతమైనది. ఇది అద్భుతమైనది కావడానికి అంతిమ కారణం ఏమిటంటే, ఈ షరతులు లేని ప్రేమ ఆయన అద్భుతమైన సన్నిధిని శాశ్వతంగా ఆనందించే స్థితిలోకి  మనలను తీసుకువస్తుంది.

కానీ ఆ ఆనందంలో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనం ఆయన మహిమను చూడటమే కాకుండా దానిని ప్రతిబింబిస్తాము. “మీయందు మన ప్రభువైన యేసు నామమును, ఆయనయందు మీరును మహిమనొందునట్లు” (2 థెస్స 1:11).

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...