‘అయితే యెహోవా వారిని చంపదలచియుండెను గనుక వారు తమ తండ్రియొక్క మొఱ్ఱను వినకపోయిరి”. (1 సమూయేలు 2:25)
యాజకుడైన ఏలి తన కుమారులు చేసిన పాపం విషయమై వారిని గద్దించినప్పుడు వారు తమ తండ్రికి విధేయత చూపలేదు. ఈ వాక్య భాగము నుండి మన జీవితాలకు అన్వయించుకొనదగిన మూడు విషయాలు ఉన్నాయి.
1) పశ్చాత్తాపపడుటకు ప్రభువు అవకాశమివ్వడని అనుకోని ఎక్కువ కాలం, ఎంతో తీవ్రంగా పాపం చేయడానికి అవకాశం ఉంది.
“దేవుడు ఎదురాడువారికి మారుమనస్సు దయచేయును” అని చెప్పలేదు గాని “దేవుడొకవేళ ఎదురాడు వారికి మారుమనస్సు దయచేయును (2 తిమోతి 2:25) అని పౌలు అన్నాడు కాబట్టి మన బోధనలన్నిటి తర్వాత వారిని వేడుకోవాలి. పాప జీవితంలో “చాలా ఆలస్యం” అనేది ఉంది. “ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసరము శ్రద్ధతో వెదకినను, మారుమనస్సు పొందనవకాశము దొరకక విసర్జింపబడెనని మీరెరుగుదురు” అని హెబ్రీ 12:17వ వచనంలో ఏశావును గురించి చెప్పబడింది. అతను విసర్జించబడ్డాడు; అతను మారుమనస్సు (పశ్చాత్తాపం) పొందలేకపోయాడు.
అలాగని, జీవితాంతం పాపం చేసినవారు, నిజంగా పశ్చాత్తాపం పడినవారందరూ రక్షించబడరని అర్థం కాదు. వారు తప్పకుండా రక్షణ పొందవచ్చు, పొందుతారు! దేవుడు కరుణామయుడు. సిలువ మీద ఉండే దొంగను గుర్తు చేసుకోండి. “నేడు నీవు నాతోకూడ పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను” (లూకా 23:43) అని యేసు ఆ దొంగతో చెప్పాడు.
2) పాపము చేస్తున్న వ్యక్తికి సరియైనదానిని చేయడానికి కొన్నిసార్లు దేవుడు అనుమతించడు.
“యెహోవా వారిని చంపదలచియుండెను గనుక వారు తమ తండ్రియొక్క మొఱ్ఱను వినకపోయిరి.” వారు తమ తండ్రి మొర్రను వినడం సరియైన విషయం, అయితే వారు వినలేపోయారు. ఎందుకు వినలేకపోయారు? “ఎందుకంటే యెహోవా వారిని చంపదలచియుండెను.”
వారు తమ తండ్రికి విధేయత చూపకపోవడానికి కారణం ఏంటంటే దేవుడు వారి కోసం వేరే ఉద్దేశాలను కలిగి ఉన్నాడు, దేవుడు వారిని పాపం చేయడానికి మరియు మరణానికి విడిచిపెట్టాడు. దేవుని ఆజ్ఞకు సంబంధించి బయలుపరచబడిన చిత్తానికి, దేవుని నిశ్చయించిన చిత్తం విభిన్నమైనదని చెప్పేటువంటి సందర్భాలు ఉన్నాయని మనకిది చూపిస్తోంది.
3) కొన్నిసార్లు బయలుపరచబడిన దేవుని చిత్తం జరగాలని ప్రార్థనలు చేయబడవు, ఎందుకంటే పరిశుద్ధత మరియు జ్ఞానయుక్తమైన ఉద్దేశాల కోసం దేవుడు విభిన్నమైన కట్టడను కలిగి ఉంటాడు.
ఏలి తన కుమారుల మార్పు కోసం ప్రార్థన చేసి ఉండవచ్చని నేననుకుంటున్నాను. ఒక తండ్రి తన పిల్లల కోసం అలాంటి ప్రార్థన తప్పక చేయాలి. అయితే, హోఫ్నీ, ఫినేహాసులు విధేయులు కాకూడదని, చంపబడాలని దేవుడు నిశ్చయించాడు.
మార్పు కోసం మనం దేవునికి మొర పెడుతున్న సందర్భంలో ఇలాంటిది ఏదైనా జరిగినప్పుడు (జరగబోయేది మనకు సాధారణంగా ముందుగానే తెలియనది), “నేను నిన్ను ప్రేమించట్లేదు” అనేది దేవుని జవాబు కాదు గాని “ఈ పాపాన్ని జయించకపోవడ౦లో, పశ్చాత్తాపాన్ని అనుగ్రహించకపోవడంలో నాకు జ్ఞానవ౦తమైన, పవిత్రమైన ఉద్దేశాలు ఉన్నాయి. మీకిప్పుడు ఈ ఉద్దేశాలు కనిపించవు. నన్ను నమ్మండి. నేనేం చేస్తున్నానో నాకు తెలుసు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను” అనేదే దేవుని జవాబుయై ఉంటుంది.