“నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడును నా పక్షముగా నిలువలేదు, అందరు నన్ను విడిచిపోయిరి; ఇది వారికి నేరముగా ఎంచబడకుండును గాక. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును, అన్యజనులందరును దాని విను నిమిత్తమును, ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను గనుక నేను సింహము నోటనుండి తప్పింపబడితిని. ప్రభువు ప్రతి దుష్కా ర్యమునుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. యుగయుగములు ఆయనకు మహిమ కలుగునుగాక, ఆమేన్.” (2 తిమోతి 4:16-18)
ఈ అద్భుతమైన మరియు హృదయ విదారకమైన మాటలను చదవడానికి నేను ఈ ఉదయకాలం ఎక్కువ సమయాన్ని గడిపాను. పౌలు రోమాలో నిర్భందంలో ఉన్నాడు. మనకు తెలిసినంతవరకు, అతడు విడుదల కాలేదు. అతడు వ్రాసిన చివరి పత్రిక ఈ విధంగా ముగుస్తుంది.
ఆలోచించి, ఆశ్చర్యచకితులవ్వండి!
అతడు విడవబడ్డాడు: “ఎవడును నా పక్షముగా నిలువలేదు.” అతడు ఒక వృద్ధుడు. నమ్మకమైన సేవకుడు. ఇంటికి చాలా దూరంలో ఉన్న ఒక తెలియని పట్టణంలో ఉన్నాడు. శతృవులచేత చుట్టబడ్డాడు. ప్రాణాపాయంలో ఉన్నాడు. ఎందుకున్నాడు? జవాబు: మనం నిరుత్సాహం చెందినప్పుడు, లేక భయముతో మనం ఒంటరితనాన్ని అనుభవిస్తున్నప్పుడు ఆదరణగా ఉండాలని “ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను!” అనే ఈ శ్రేష్టమైన మాటను పౌలు వ్రాశాడు.
ఆహా, ఆ మాటలను చదివినప్పుడు నా హృదయం ఉప్పొంగుతోంది! మీరు మీ స్నేహితుల ద్వారా విడువబడినప్పుడు, దేవునికి వ్యతిరేకంగా మొర పెట్టారా? అలాగయితే,మీ జీవితంలో ప్రజలనే మీకు దేవుళ్ళుగా ఎంచుకుంటున్నారా? లేదా “ఇదిగో నేను యుగసమాప్తివరకు సదాకాలము మీతోకూడ ఉన్నాను” (మత్తయి 28:20) అనే ఈ అద్భుతమైన సత్యాన్నిబట్టి ధైర్యాన్ని తెచ్చుకుంటున్నారా? మిమ్మల్ని ఎవరు విడిచిపెట్టి వెళ్ళినా? “నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను” (హెబ్రీ 13:5) అనే గొప్ప వాగ్దానంతో మీ హృదయాన్ని బలపరచుకొనుచున్నారా?
“ప్రభువు నా ప్రక్కన నిలుచున్నాడు!” అని మనం చెప్పగలగాలి.
ప్రశ్న: 2 తిమోతి 4:18వ వచనంలో ఉన్న సమస్య ఏమిటి?
జవాబు: ప్రభువు యొక్క పరలోక రాజ్యాన్ని పొందలేడనే భావాన్ని పౌలు కలిగియుండవచ్చు! అయితే, ఆ సమస్యకు విరుద్ధంగా పౌలు, “ప్రభువు ప్రతి దుష్కార్యమునుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును” అని మొర పెడుతున్నాడు.
ప్రశ్న: పౌలు పరలోక రాజ్యాన్ని పొందలేడనే భావనకు ఎలా గురయ్యాడు?
జవాబు: “దుష్కార్యములు.” “ప్రభువు ప్రతి దుష్కార్యమునుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును.”
ప్రశ్న: పౌలు పరలోక రాజ్యాన్ని పొందలేడేమోనన్న భావనకు దుష్కార్యము ఎలా గురి చేసింది?
జవాబు: క్రీస్తుకు అవిధేయతను చూపించి, క్రీస్తుతో తనకున్న సత్సంబంధాన్ని విడిచిపెట్టుకోమని పౌలును శోధించుట ద్వారా పౌలు పరలోక రాజ్యాన్ని పొందలేడేమోనన్న భావనకు దుష్కార్యము గురి చేసింది.
ప్రశ్న: “సింహపు నోట నుండి” పౌలు గారు రక్షించబడ్డానని చెప్పింది ఈ శోధన గురించేనా?
జవాబు: అవును, ఇది ఆ శోధన గురించే చెప్పబడింది. “నిబ్బరమైన బుద్ధిగలవారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అప వాది గర్జించు సింహమువలె ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరులయందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని యెరిగి, విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి” (1 పేతురు 5:8-9)
ప్రశ్న: పౌలు ఈ సాతాను శోధనకు గురి కాకుండా, సహించుకొని, విశ్వాసంలో స్థిరంగా ఉండి, విధేయత చూపినట్లయితే, మహిమను ఎవరు పొందుకుంటారు?
జవాబు: ప్రభువే మహిమను పొందుకుంటాడు – “యుగయుగములకు ప్రభావమాయనకు (ప్రభువుకు) కలుగునుగాక. ఆమేన్” (1 పేతురు 5:10). “యుగయుగములు ఆయనకు (ప్రభువుకు) మహిమ కలుగునుగాక, ఆమేన్” (2 తిమోతి 4:18).
ప్రశ్న: ఎందుకు? పౌలు స్థిరంగా నిలబడలేదా?
జవాబు: “ప్రభువు నా పక్షాన నిలబడ్డాడు మరియు నన్ను బలపరచాడు!”
ఈ వర్తమానము చాలా బాగుంది దేవుని కి మహిమ కలుగును గాక