పునరుత్థానం మనకు ఎలా వర్తిస్తుంది?

పునరుత్థానం మనకు ఎలా వర్తిస్తుంది?

షేర్ చెయ్యండి:

“అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయ మందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు”. (రోమా 10:9)

“దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయ మందు విశ్వసించినయెడల” అంటే ఏమిటి? దేవుడు యేసును మృతులలోనుండి లేపాడని సాతాను నమ్ముతాడు. అది జరుగుతుండగా చూశాడు. ఈ ప్రశ్నకు సమాధానమివ్వడానికి, దేవుని ప్రజలకు పునరుత్థానం అంటే ఏమిటో మనం ఆలోచించాలి.

పునరుత్థానం అంటే దేవుడు మన పక్షాన ఉన్నాడు అని అర్థం. ఆయన మనతో సన్నిహితంగా ఉండడమే లక్ష్యంగా చేసుకున్నాడు. విసర్జించబడినవారము మరియు దూరస్థలము అనే మన భావాలన్నింటినీ అధిగమించాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు.

యేసు పునరుత్థానం అనేది ఇజ్రాయేలుకు మరియు ప్రపంచానికి దేవుడు చేసిన ప్రకటన. మనం ఏమీ చేసిన మహిమను పొందలేము, కానీ మనల్ని అక్కడికి తీసుకురావడానికి ఆయన అసాధ్యమైన పనిని చేయాలనుకుంటున్నాడు.

పునరుత్థానం అనేది యేసును విశ్వసించే వారందరూ నీతి మార్గాల్లో మరియు మరణలోయ గుండా నడిపించే దేవుని శక్తికి లబ్ధిదారులవుతారని దేవుని వాగ్దానం.

కాబట్టి, దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించడం అనేది కేవలము  అంగీకరించే వాస్తవం కంటే చాలా ఎక్కువ. దేవుడు మీ కోసం ఉన్నాడని, ఆయన మీతో సన్నిహితంగా ఉన్నాడని, ఆయన మీ జీవితాన్ని మారుస్తున్నాడని మరియు శాశ్వతమైన ఆనందం కోసం మిమ్మల్ని రక్షిస్తాడని నమ్మడమే దీని అర్థం.

పునరుత్థానాన్ని విశ్వసించడం అంటే జీవితం మరియు నిరీక్షణ మరియు నీతి కోసం అన్ని వాగ్దానాలపై నమ్మకం ఉంచడం.

దేవుని శక్తి మరియు ప్రేమపై ఎంతగా నమ్మకం ఉంచాలంటే ఈ లోకంలో ఏమైన నష్టపోతామనే భయముగాని అలాగే ఈ లోకంలో ఏదో లాభం పట్ల దురాశగాని ఆయన చిత్తానికి అవిధేయత చూపడానికి  మనల్ని బలవంత పెట్టలేవు.సాతానుకు మరియు పరిశుద్ధులకు మధ్య ఉన్న తేడా అదే. దేవుడు ఆయనను ప్రేమించుటకు (ద్వితీయోపదేశకాండము 30:6) మరియు తన కుమారుని పునరుత్థానంలో విశ్రాంతి తీసుకోవడానికి మన హృదయాలను సున్నతిచేయును గాక.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...