దేవుడు గర్వించేది

దేవుడు గర్వించేది

షేర్ చెయ్యండి:

“అయితే వారు మరి శ్రేష్ఠమైన దేశమును, అనగా పరలోకసంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారినిగూర్చి సిగ్గుపడడు; ఏలయనగా ఆయన వారికొరకు ఒక పట్టణము సిద్ధపరచియున్నాడు”. (హెబ్రీ 11:16)

దేవుడు అబ్రాహాము, ఇస్సాకు మరియు యాకోబుల గురించి ఏమి చెప్పాడో నాతో చెప్పాలని నేను చాలా కోరుకుంటున్నాను: “నేను నీ దేవుడనని అనిపించుకొనుటకు సిగ్గుపడను.”

ఇది ఎంత ప్రమాదకరం అనిపించినా, దేవుడు నా దేవుడుగా పిలిపించుకోడానికి ఆయన “గర్వపడతాడు” అని దీని అర్థం కాదా? ఈ అద్భుతమైన అవకాశం (హెబ్రీ 11:16లో) వెనుక రెండు కారణాలున్నాయి:

మొదటి కారణం: “అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారినిగూర్చి సిగ్గుపడడు; ఏలయనగా ఆయన వారికొరకు ఒక పట్టణము సిద్ధపరచియున్నాడు.”

తమ దేవుడు అని పిలిపించుకోడానికి సిగ్గుపడకపోవడానికి దేవుడు చెప్పే మొదటి కారణం ఏమిటంటే, ఆయన వారి కోసం ఒకటి చేశాడు. ఆయన ఒక పట్టణము సిద్ధపరచియున్నాడు – పరలోక పట్టణం “దీని శిల్పియు నిర్మాణకుడు దేవుడు” (హెబ్రీ 11:10). కాబట్టి, ఆయన వారి దేవుడు అని పిలిపించుకోడానికి సిగ్గుపడకపోవడానికి మొదటి కారణం, ఆయన వారి కోసం ఒక కార్యం చేసాడు. అంతే కానీ, వారు ఆయనకేం ప్రత్యేకంగా చేయలేదు.

ఇప్పుడు, ఆయన చెప్పిన రెండవ కారణాన్ని పరిగణించండి: “అయితే వారు మరి శ్రేష్ఠమైన దేశమును, అనగా పరలోకసంబంధమైన దేశమును కోరుచున్నారు అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారినిగూర్చి సిగ్గుపడడు”.

“అందుచేత” అనే పదం మన దేవుడు అని పిలిపించుకోడానికి ఎందుకు సిగ్గుపడడు అనేదానికి ఒక కారణం. కారణం వారికున్న కోరిక. వారు శ్రేష్ఠమైన దేశాన్ని కోరుకుంటారు – అంటే, వారు నివసించే భూసంబంధమైన దేశం కంటే మెరుగైన దేశం; అనగా దేవుడు ఉండే పరలోకము.

మనం ఈ పరలోక పట్టణాన్ని అనగా ఈ దేవుని నివాస స్థలాన్ని, ఈ ప్రపంచం ఇవ్వగలిగే దానికంటే ఎక్కువగా కోరుకుంటే, దేవుడు మన దేవుడు అని పిలిపించుకోడానికి సిగ్గుపడడు. ఆయన మనకొరకు వాగ్దానము చేసిన వాటన్నిటిని మనం ఎక్కువగా కోరుకున్నప్పుడు, ఆయన మన దేవుడని పిలిపించుకోడానికి గర్వపడతాడు. ఇది శుభవార్త.

కాబట్టి, ఆయన మన కోసం సిద్ధం చేసిన దేవుని పట్టణమైన శ్రేష్ఠమైన దేశం వైపు మీ కళ్ళు తెరవండి మరియు మీ పూర్ణ హృదయంతో దానిని కోరుకోండి. దేవుడు మీ దేవుడు అని పిలిపించుకోడానికి సిగ్గుపడడు.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...