“ఎవడు దీనుడై నలిగిన హృదయముగలవాడై నా మాట విని వణకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను”. (యెషయా 66:2)

యథార్థ హృదయానికి మొదటి గుర్తు ఏమిటంటే అది ప్రభువు మాటకు వణుకుతుంది.

యెషయా 66లో ప్రవక్త ఈ సమస్యను గూర్చి ప్రస్తావిస్తున్నాడు: కొందరు దేవునికి నచ్చే విధంగా మరికొందరు దేవునికి నచ్చని విధంగా ఆరాధిస్తున్నారు. 3వ వచనం చెడ్డవారు అర్పించే బలులు గూర్చి వివరిస్తుంది, “ఎద్దును వధించువాడు నరుని చంపువానివంటివాడే.” వారి అర్పణలు దేవునికి అసహ్యకరమైనవి – హత్యతో సమానం. ఎందుకు?

4వ వచనంలో దేవుడు ఇలా వివరించాడు, “నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చువాడొకడును లేక పోయెను నేను మాటలాడినప్పుడు వినువాడొకడును లేక పోయెను.” ప్రజలు ఆయన స్వరానికి చెవిటివారుగా ఉన్నారు కాబట్టి వారి అర్పణలు దేవునికి అసహ్యకరమైనవి. అయితే దేవుడు ఎవరి ప్రార్థనలు విన్నాడో వారి సంగతేంటి? దేవుడు 2వ వచనంలో ఇలా చెప్పాడు, “ఎవడు దీనుడై నలిగిన హృదయముగలవాడై నా మాట విని వణకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను.”

యథార్థ హృదయుల మొదటి గుర్తు, వారి ప్రార్థనలు దేవునికి సంతోషాన్ని కలిగిస్తాయి, వారు దేవుని వాక్యానికి వణుకుతారు. ప్రభువు వీరి మీద దృష్టి ఉంచుతారు.

కాబట్టి, దేవుణ్ణి సంతోషపెట్టే యథార్థవంతుల ప్రార్థన మొదట దేవుని సన్నిధిని ప్రమాదకరంగా భావించే హృదయం నుండి వస్తుంది. అది దేవుని వాక్యం వినగానే వణుకుతుంది, ఎందుకంటే అది దేవుని ఉద్ధేశాలకు దూరంగా మరియు ఆయన తీర్పు ప్రమాదపు అంచులలో మరియు చాలా నిస్సహాయ స్థితిలో ఉన్నట్లుగా భావిస్తుంది. మరియు దాని వైఫల్యాలకు చింతిస్తుంది.

కీర్తన 51:17లో దావీదు చెప్పినది ఇదే, “విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు.” దేవుడు అంగీకరించే  ప్రార్థనలో మొదటి విషయం ఏమిటంటే, ప్రార్థన చేసే వ్యక్తి యొక్క విరిగినలిగిన స్థితి మరియు వినయం. ఆయన మాటకు వారు వణుకుతారు.

జాన్ పైపర్
జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *