దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి?
దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీతట్టు కనిపెట్టియున్నాను. నీళ్లులేక యెండియున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనియున్నది నీ మీది ఆశచేత నిన్ను చూడవలెనని నా శరీరము కృశించుచున్నది. నీ కృప జీవముకంటె ఉత్తమము నా పెదవులు నిన్ను స్తుతించును. (కీర్తన 63:1-2)
దావీదు లాంటి హృదయాన్నేదేవుడు తృప్తిపరుస్తాడు. దావీదు దేవుని హృదయానుసారుడైయుండెను. ఆ విధంగా ఉండాలనే మనం కూడా సృష్టించబడియున్నాము.
దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవునిలో తృప్తి కలిగి ఉండడమే. ఆయనలో తృప్తి కలిగి ఉండడం అంటే, ఆయన ఇచ్చేటువంటి వరాలలో మాత్రమే కాదు గాని మహిమగల వ్యక్తిగా ఉన్న ఆ దేవునిలోనే తృప్తి కలిగి ఉండడమని అర్థం!
దేవుణ్ణి ప్రేమించడంలో ఆయన ఆజ్ఞలన్నిటికి విధేయత చూపుటనేది ఉంటుంది; ఆయన మాటలన్నిటిని నమ్ముట అనేది ఉంటుంది; ఆయన వరాలన్నిటి కోసం ఆయనకు కృతజ్ఞతలు చెప్పడం అనేది కూడా ఉంటుంది. అయితే, అవన్నీ పొంగి పొర్లుతూ ఉంటాయి. దేవుడు ఏమైయున్నాడనే దానినిబట్టి ఆయనను ఆరాధించడం మరియు ఆయనలో ఆనందించడం అనేది దేవుణ్ణి ప్రేమించడం యొక్క సారమైయున్నది. దేవునిలో మనం కలిగి ఉండే ఈ ఆనందమే మనం స్పందించే ఇతర స్పందనలన్నీ ఆయనను నిజంగా మహిమపరిచేలా చేస్తుంది.
ఈ విషయం మనకు సహజంగానే తెలుసు, అలాగే లేఖనం నుండి కూడా తెలుసు. కర్తవ్య నియమ నిబంధనలనుబట్టి మనం ఎక్కువగా గౌరవించబడుతున్నామని అనిపిస్తుందా? లేక సహవాస సంతోషాల ద్వారా మనకు సేవ చేసేవారి ప్రేమ ద్వారా మనం ఎక్కువగా గౌరవించబడుతున్నామని అనిపిస్తుందా?
నేను నా భార్యతో, “నీతో సమయం గడపటమంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది” అని చెప్పినప్పుడు నా భార్య గౌరవించబడుతుంది. నా సంతోషమంతా తన క్షేమాన్ని కోరుకోవడమే. అందుచేత, దేవుని విషయంలోనూ అంతే. ఆయనలో ఎంత తృప్తి చెందితే అంత ఎక్కువగా అయన మనలో మహిమపరచబడతాడు.
మనలో ఏ ఒక్కరం దేవునిలో పరిపూర్ణంగా తృప్తి పొందలేదు. భూ సంబంధమైన సుఖ సౌఖ్యాలను నేను పోగొట్టుకున్నప్పుడు నా హృదయం సణిగినందుకు నేను ఎన్నోమార్లు దుఃఖపడ్డాను. అయితే, దేవుడు మంచివాడని నేను రుచి చూశాను. దేవుని కృప ద్వారా నిత్య శాశ్వత ఆనందాన్ని నేనిప్పుడు తెలుసుకున్నాను.
“యెహోవా యొద్ద ఒక్క వరము అడిగితిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింప గోరుచున్నాను” (కీర్తన 27:4) అని ప్రజలు నాతో చెప్పేవరకు ఆ ప్రజలను ఈ నిత్య ఆనందంలోనికి ఆకర్షించడానికి ప్రతి రోజును గడపడానికి నేనిష్టపడతాను.

జాన్ పైపర్
జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.
సంబంధిత ధ్యానాలు...
ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది
సంస్కరణ
"సంస్కరణ" వాట్సాప్ ఛానెల్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఫేస్బుక్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఇన్స్టాగ్రామ్
క్లిక్ చెయ్యండి👆🏿
చిరునామా:
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్:
9866436426, 9958799659, 9151519121
ఇమెయిల్:
samskarana2024@gmail.com
©Samskarana – Powered By ABNY Web