ప్రభువును సన్నుతించడం అంటే ఏమిటి?

షేర్ చెయ్యండి:

“నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. నా అంతరంగముననున్న సమస్తమా, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము”. (కీర్తన 103:1)

కీర్తనాకారుడు తన ప్రాణముకు ప్రభువును సన్నుతించమని బోధించడంతో ఈ కీర్తనను ప్రారంభించడమే కాకుండా దానితోనే ముగిస్తున్నాడు – ” నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము” – మరియు దేవదూతలకు మరియు పరలోక సైన్యములకు దేవుని చేతి పనులను గూర్చి చెప్తూ వారు కూడా అదే చేయాలని బోధిస్తున్నాడు.

“యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకులోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా, ఆయనను సన్నుతించుడి. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరు ఆయనను సన్నుతించుడి. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలోనున్న ఆయన సర్వకార్యములారా, ఆయనను స్తుతించుడి. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము”. (కీర్తన 103:20-22)

ఈ కీర్తన ప్రభువును సన్నుతించడంపై మిక్కిలి దృష్టి పెట్టింది. ప్రభువును సన్నుతించడం అంటే ఏమిటి?

నిజంగా మీ ఆత్మ యొక్క లోతులలో నుండి ఆయన గొప్పతనం మరియు మంచితనం గురించి బాగా మాట్లాడటం అని దీని అర్థం.

ఈ కీర్తనలోని మొదటి మరియు చివరి వాక్యాలలో “నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము”అని దావీదు చెప్పినప్పుడు, దేవుని మంచితనం మరియు ఆయన గొప్పతనం గురించిన యాదార్ధమైన మాటలు అంతరంగం నుండి రావాలని చెప్తున్నాడని అర్ధం చేసుకోవాలి.

మన ఆత్మలో లేకుండా నోటితో మాత్రమే దేవుడిని సన్నుతించడం వేషధారణ  అవుతుంది. “ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది;” అని యేసు చెప్పాడు (మత్తయి 15:8). దావీదుకు ఆ ప్రమాదం తెలుసు, మరియు అతను తనకు తాను బోధించుకుంటున్నాడు. అలా జరగకూడదని తన ఆత్మకు తాను చెబుతున్నాడు.“నా ప్రాణమా,, దేవుని గొప్పతనాన్ని మరియు మంచితనాన్ని చూడు. నా నోటితో కలిసి పరిపూర్ణతతో ప్రభువును సన్నుతించుదుము. ప్రాణమా, అప్పుడు మనము వేషధారులగా ఉండము!”

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...