చింతకు వ్యతిరేకంగా యుద్ధ సామాగ్రి

చింతకు వ్యతిరేకంగా యుద్ధ సామాగ్రి

షేర్ చెయ్యండి:

“దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి”. (ఫిలిప్పీ 4:6)

మన విన్నపాలు దేవునికి తెలియజేసినప్పుడు మన౦ కృతజ్ఞత కలిగి ఉ౦డే వాటిలో ఆయన వాగ్దానాలు ఒకటి. ఈ వాగ్దానాలు ఎలాంటివంటే చింతను పుట్టించే అవిశ్వాసాన్ని తీసివేయగల ఫిరంగిలోని మందుగుండు సామగ్రివంటివి. కాబట్టి నేను ఎలా పోరాడుతానో ఇక్కడ వ్రాసాను చూడండి.

నా పరిచర్య నిరుపయోగ౦గా, శూన్య౦గా ఉందని నేను చింతిస్తున్నప్పుడు, “నిష్ఫలముగా నాయొద్దకు మరలక అది నాకు అనుకూలమైనదాని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలముచేయును” అని యెషయా 55:11లోని వాగ్దానాన్ని ఆధారం చేసుకొని అపనమ్మకంతో పోరాడతాను.

నా పనిని నేను చేసుకోవడానికి బలహీనంగా ఉన్నానని నేను చింతిస్తున్నప్పుడు, “నా కృప నీకు చాలును, బలహీనతయందు నాశక్తి పరిపూర్ణమగుచున్నది” అని (2 కొరింథీ 12:9) యేసు చెప్పిన వాగ్దానాన్ని ఆధారం చేసుకొని అపనమ్మకంతో పోరాడుతాను.

భవిష్యత్తును గురించి నేను నిర్ణయాలు తీసుకునేదాని విషయమై నేను చింతిస్తున్నప్పుడు, “నీకు ఉపదేశము చేసెదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను నీ మీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను” అని కీర్తన 32:8వ వచనంలోని వాగ్దానాన్ని ఆధారం చేసుకొని నేను అపనమ్మకంతో పోరాడుతాను.

శత్రువులను ఎదుర్కోవడం గురించి నేను చింతిస్తున్నప్పుడు, “ఇట్లుండగా ఏమందుము? దేవుడు మనపక్షముననుండగా మనకు విరోధియెవడు?” (రోమా 8:31) అనే వాగ్దానాన్ని ఆధారం చేసుకొని నేను అపనమ్మకంతో పోరాడుతాను.

నాకు ప్రియులైనవారి సంక్షేమం గురించి నేను చింతిస్తున్నప్పుడు, “మీరు చెడ్డ వారై యుండియు మీ పిల్లలకు మంచి యీవుల నియ్య నెరిగి యుండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటె ఎంతో నిశ్చయముగా మంచి యీవుల నిచ్చును” (మత్తయి 7:11) అనే వాగ్దానాన్ని ఆధారం చేసుకొని నేను అపనమ్మకంతో పోరాడుతాను.

క్రీస్తు కోస౦ ఇంటిని, అన్నదమ్ములను, అక్కా చెల్లెళ్ళను, తల్లిదండ్రులను, పిల్లలను, పొలాలను విడిచిపెట్టిన ప్రతి ఒక్కరూ “ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్కచెల్లెండ్రను తల్లులను పిల్లలను భూములను, రాబోవు లోకమందు నిత్యజీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మొదటి వారు అనేకులు కడపటివారగుదురు, కడపటివారు మొదటి వారగుదురు అనెను” (మార్కు 10:29-30) అనే వాగ్దానం జ్ఞాపకం చేసికొని నా ఆధ్యాత్మికతను కాపాడుకోవడానికి నేను పోరాడుతాను.

నేను రోగంతో ఉండుటను గురించి నేను చింతిస్తున్నప్పుడు, “నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలోనుండి యెహోవా వానిని విడిపించును” (కీర్తన 34:19) అనే వాగ్దానాన్ని ఆధారం చేసుకొని నేను అపనమ్మకంతో పోరాడుతాను.

“అంతే కాదు; శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని యెరిగి శ్రమలయందును అతిశయపడుదము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడియున్నది” (రోమా 5:3-5) అనే వాగ్దానాన్ని నేను వణుకుతూ తీసుకుంటాను.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

One comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...