మనము కనిపెట్టుకొని ఉంటాము, కార్యం ఆయన చేస్తాడు
“తనకొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలముచేయు మరి ఏ దేవునిని ఎవడు నేకాలమున చూచియుండలేదు”. (యెషయా 64:4)
దేవుడు నా కోసం కార్యము చేయడం ద్వారా తన దైవత్వాన్ని చూపించడానికి ఇష్టపడతాడు మరియు నా కోసం ఆయన చేసే కార్యం ఎప్పుడూ నేను ఆయన కోసం చేసే కార్యానికి ముందు, క్రింద మరియు లోపలే ఉంటుంది. ఈ సత్యం కంటే ఎక్కువ ఆనందాన్ని కలిగించే విషయం మరొకటి లేదు.
ఆయన మన కోసం పని చేస్తాడని చెప్పడం మొదట గర్వంగా దేవుడిని కించపరచినట్లుగా అనిపించవచ్చు. నేను యజమానిని మరియు దేవునికి ఉద్యోగం కావాలి అనే విధంగా అర్ధంచేసుకోవడం వల్ల అలా అనిపిస్తుంది. దేవుడు మన కోసం చేస్తున్న పనిని గురించి బైబిల్ మాట్లాడుతున్నప్పుడు దానర్థం అది కాదు. దేవుడు “తనకొరకు కనిపెట్టువాని విషయమై తన కార్యము సఫలముచేయును” (యెషయా 64:4) అని చెప్పినప్పుడు యెషయా మనస్సులో అది అస్సలు లేదు.
దేవుడు నా కోసం పనిచేస్తాడని చెప్పడంలో అర్ధం ఏమిటంటే నేను దివాళా తీసాను మరియు ఆదుకునబడేందుకు ఆయన అవసరం నాకుంది. నేను బలహీనంగా ఉన్నాను కాబట్టి బలమైన వ్యక్తి నాకు కావాలి. నేను ప్రమాదంలో ఉన్నాను కాబట్టి నాకు భద్రపరిచేవాడు కావాలి. నేను మూర్ఖుడిని కాబట్టి నాకు తెలివైన వ్యక్తి కావాలి. నేను తప్పిపోయాను కాబట్టి నాకు రక్షకుడు కావాలి.
దేవుడు నా కోసం పనిచేస్తాడు అంటే ఆయన చేసే పనిని నేను చేయలేను. నాకు పూర్తిగా ఆయన సహాయం అవసరం.
ఇది దేవుణ్ణి మహిమ పరుస్తుంది, నన్ను కాదు. ఇచ్చేవాడు మహిమని పొందుతాడు. శక్తిమంతుడు ప్రశంసలు అందుకుంటాడు.
దేవుడు మీ కోసం పని చేస్తున్నాడని బైబిల్ చెప్పే విధానాన్ని వినండి మరియు మీ స్వంత భారాన్ని భరించే భారం నుండి విముక్తి పొందండి. ఆయన్ని ఆ పని చేయనివ్వండి.
1. “తనకొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలముచేయు మరి ఏ దేవునిని ఎవడు నేకాలమున చూచియుండలేదు” (యెషయా 64:4).
2. దేవుడు “ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనను కొదువ యున్నట్టు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు.” (అపొస్తలుల కార్యములు 17:25).
3. “మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెననెను.” (మార్కు 10:45).
4. ” తనయెడల యథార్థహృదయముగలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది; ” (2 దినవృత్తాంతములు 16:9).
5. “నేను ఆకలిగొనినను నీతో చెప్పను . . . ఆపత్కాలమున నీవు నన్నుగూర్చి మొఱ్ఱపెట్టుము నేను నిన్ను విడిపించెదను నీవు నన్ను మహిమపరచెదవు.” (కీర్తన 50:12, 15).
6. “ముదిమి వచ్చువరకు నిన్ను ఎత్తికొనువాడను . . . నిన్ను ఎత్తికొనువాడను నేనే నేనే చేసియున్నాను చంకపెట్టుకొనువాడను నేనే నిన్ను ఎత్తికొనుచు రక్షించువాడను నేనే.” (యెషయా 46:4).
7. ” వారందరికంటె నేనెక్కువగా ప్రయాసపడితిని. ప్రయాసపడినది నేను కాను, నాకు తోడైయున్న దేవుని కృపయే.” (1 కొరింథీయులు 15:10).
8. ” యెహోవా ఇల్లు కట్టించనియెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే.” (కీర్తన 127:1).
9. ” ఒకడు ఉపచారము చేసినయెడల దేవుడు అను గ్రహించు సామర్థ్యమునొంది చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోను యేసుక్రీస్తు ద్వారా మహిమపరచ బడును. ” (1 పేతురు 4:11).
10. “మీ సొంతరక్షణను కొనసాగించుకొనుడి.. . . మీరు ఇచ్ఛయించుట కును కార్యసిద్ధి కలుగజేసికొనుటకును, మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే.” (ఫిలిప్పీయులు 2:12-13).11. ” నేను నాటితిని, అపొల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే” (1 కొరింథీయులు 3:6).
జాన్ పైపర్
జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.
సంబంధిత ధ్యానాలు...
ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది
సంస్కరణ
"సంస్కరణ" వాట్సాప్ ఛానెల్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఫేస్బుక్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఇన్స్టాగ్రామ్
క్లిక్ చెయ్యండి👆🏿
చిరునామా:
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్:
9866436426, 9958799659, 9151519121
ఇమెయిల్:
samskarana2024@gmail.com
©Samskarana – Made with❤️by ABNY Web