మనం విశ్వాసం వలన జీవిస్తున్నాం
“నేనిప్పుడు శరీర మందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారునియందలి విశ్వాసమువలన జీవించుచున్నాను”. (గలతీ 2:20)
దేవుని భవిష్యత్తు కృపతో, విశ్వాసం సరిగ్గా సరిపోతుంది. ఇది కృప యొక్క స్వేచ్ఛ మరియు సర్వసమృద్ధికి అనుగుణంగా ఉంటుంది. మరియు ఇది దేవుని మహిమాన్వితమైన విశ్వసనీయత దృష్టిని ఆకర్షిస్తుంది.
దీని నుండి మనం అర్ధం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటి ఏమిటంటే, నీతిమంతులుగా తీర్చే విశ్వాసం మరియు పవిత్రపరిచే విశ్వాసం – ఈ రెండు వేర్వేరు విశ్వాసాలు కాదు. “పవిత్రపరచబడుట” అంటే పరిశుద్దులుగా చేయడం లేదా క్రీస్తు సారూప్యంలోనికి మారడం అని అర్ధం. ఇదంతా కృప వల్లనే.
కాబట్టి, ఇది విశ్వాసం ద్వారానే అవుతుంది. విశ్వాసం అనేది కృపతో అనుసంధానించబడిన ఆత్మ కార్యం, మరియు దానిని స్వీకరించడం, దానిని విధేయత చూపే శక్తిగా మార్చడం మరియు మన గర్వం ద్వారా కృపను రద్దు చేయకుండా కాపాడుతుంది.
పౌలు విశ్వాసం మరియు పవిత్రీకరణ మధ్య ఈ సంబంధాన్ని గలతీ 2:20 (విశ్వాసం వలన జీవించుచున్నాను) లో స్పష్టంగా చెప్పాడు. పవిత్రీకరణ అనేది ఆత్మ ద్వారా మరియు విశ్వాసం ద్వారా జరిగే దేవుని క్రియ. ఇంకో విధంగా చెప్పాలంటే ఇది కృప ద్వారా మరియు విశ్వాసం ద్వారా జరుగుతుంది అని చెప్పడం. ఆత్మ అంటే “కృప యొక్క ఆత్మ” (హెబ్రీ 10:29). దేవుడు మనలను తన ఆత్మ ద్వారా పవిత్రపరుస్తాడు; కానీ ఆ ఆత్మ సువార్తయందు విశ్వాసం ఉంచడం ద్వారా పనిచేస్తాడు
నీతిమంతులుగా తీర్పు తీర్చే విశ్వాసమే పవిత్రపరిచే విశ్వాసం కావడానికి కారణం ఏమిటంటే, నీతిమంతులుగా తీర్చబడటం మరియు పవిత్రీకరణ రెండూ దేవుని సార్వభౌమ కృప యొక్క పని. మరియు ఇది కృపకు అనుగుణంగా ఉండే విశ్వాసం. నీతిమంతులుగా తీర్చబడటం మరియు పవిత్రీకరణ అనేవి ఒకే రకమైన పని కాదు (నీతిమంతులుగా తీర్పు తీర్చబడటం అనేది మనకి ఆపాదించబడిన దేవుని నీతి; పవిత్రీకరణ అనేది దేవుడు మన లోపలికి చొప్పించే నీతి). ఇవి రెండూ దేవుని కృప యొక్క పనులు. పవిత్రీకరణ మరియు నీతిమంతులుగా తీర్చబడటం “కృప వెంబడి కృపే” (యోహాను 1:16).
దేవుని ఉచిత కృపకు మానవ స్పందన ఏంటంటే విశ్వసించడం. నీతిమంతులుగా తీర్చబడటం మరియు పరిశుద్ధపరచబడుట రెండూ కృపతో కూడిన కార్యములు అయితే, అవి రెండూ విశ్వాసము వలననే జరుగుతాయి.

జాన్ పైపర్
జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.
సంబంధిత ధ్యానాలు...
ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది
సంస్కరణ
"సంస్కరణ" వాట్సాప్ ఛానెల్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఫేస్బుక్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఇన్స్టాగ్రామ్
క్లిక్ చెయ్యండి👆🏿
చిరునామా:
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్:
9866436426, 9958799659, 9151519121
ఇమెయిల్:
samskarana2024@gmail.com
©Samskarana – Powered By ABNY Web