విశ్వాసం ద్వారా మనం ఆత్మను అనుభవిస్తాం

షేర్ చెయ్యండి:

“ఆత్మను మీకు అనుగ్రహించి, మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్రసంబంధ క్రియలవలననా లేక విశ్వాసముతో వినుటవలననా చేయించుచున్నాడు?” (గలతీ 3:5)

ప్రతి క్రైస్తవునిలో పరిశుద్ధాత్ముడు నివాసమైయున్నాడు. “ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయనవాడు కాడు” (రోమా 8:9) అని అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు. రక్తం ద్వారా కొనబడిన దేవుని వాగ్దానాలను నమ్మినప్పుడే మొట్ట మొదటిసారిగా ఆత్మ దేవుడు మీ దగ్గరకు వచ్చాడు. ఆత్మ దేవుడు ఇదే విధంగా వస్తూనే ఉంటాడు, ఆయన పని చేస్తూనే ఉంటాడు.

అందుచేత, “ఆత్మను మీకు అనుగ్రహించి, మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్రసంబంధ క్రియలవలన చేయించుచున్నాడా లేక విశ్వాసముతో వినుటవలన చేయించుచున్నాడా?” అని గలతీ 3:5వ వచనంలో పౌలు ప్రశ్నిస్తున్నాడు. ఈ ప్రశ్నకు జవాబు, “విశ్వాసముతో వినుటవలన” అని మనకు తెలుసు.

కాబట్టి, ఆత్మ దేవుడు మొదటి సారిగా వచ్చాడు, విశ్వాసము ద్వారా  ఆత్మ అనుగ్రహించబడుతూనే ఉంటాడు. విశ్వాసము ద్వారానే ఆయన మనలో, మన ద్వారా ఏదైనా సాధిస్తాడు.

మీరు నాలాగే ఉన్నట్లయితే, మీ జీవితంలో పరిశుద్ధాత్ముని బలమైన కార్యం జరగడం కోసం మీరు బలమైన కోర్కెలను కలిగియుండవచ్చు. మీ జీవితంలో, మీ కుటుంబంలో, మీ సంఘంలో, మీ సిటీలో ఆత్మ కుమ్మరింపు కోసం దేవునికి మొర పెడుతుండవచ్చు. అటువంటి మొరలు మంచివే, సరియైనవే. “పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును” (లూకా 11:13) అని యేసు చెప్పాడు.

కానీ దేవుని ప్రత్యేకమైన వాగ్దానాలను నమ్మడం ద్వారా ఆత్మ కార్యం పూర్తి స్థాయిలో స్పందించకపోవడంలో విఫలం చెందటాన్ని నా జీవితంలో నేను తరచుగా చూశాను. మనం అడిగినప్పుడు పరిశుద్దాత్ముడు వస్తాడనే వాగ్దానం గురించి మాత్రమే నేను చెప్పడంలేదు. ఆత్మను గురించి నేరుగా చెప్పబడని ఇతర అమూల్యమైన వాగ్దానాలన్నిటి గురించి చెప్తున్నాను, ఉదాహరణకు, భవిష్యత్తులో నా అవసరాలన్నిటిని దేవుడు తీర్చడం గురించి చెప్పుకోవచ్చు, “దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును” (ఫిలిప్పీ 4:19). ప్రత్యేకమైన పరిస్థితుల కోసం ప్రత్యేకమైన వాగ్దానాలలో విశ్వాసానికి సంబంధించిన ప్రత్యేకమైన కార్యముల ద్వారా దేవుని ఆత్మ నిరంతరంగా కొనసాగే శక్తివంతమైన మార్గంలో ప్రతి అవసరమును తీర్చును. ఆయన వాగ్దానం చేసిన ప్రతిదానిని చేస్తాడని నేనిప్పుడు ఆయనను నమ్ముతున్నానా?

అనేకమంది క్రైస్తవులు తమ జీవితాలలో పరిశుద్ధాత్మ శక్తి కోసం ఎదురుచూసినప్పుడు వారి అనుభవంలో ఇదే లోపిస్తోంది. “విశ్వాసంతో వినడం ద్వారా” ఆత్మ మనకు అనుగ్రహించబడుతుంది (గలతీ 3:5), అంటే ఆత్మను గురించి ఉన్నటువంటి ఒకటి లేక రెండు వాగ్దానాలలో విశ్వాసం ఉంచడం కాదు గాని మన కోసం చేయడం గురించి, మన కోసం ఉండటం గురించి, మన భవిష్యత్తులో మనకు అవసరమైన వాటన్నిటిలోను అంతరంగాన్ని తృప్తి పరిచే దేవుని సన్నిధికి సంబంధించిన వాగ్దానాలన్నిటినిలోను విశ్వాసం ఉంచాలి. 

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...