“ఏలయనగా మనలను దేవునియొద్దకు తెచ్చుటకు, అనీతిమంతులకొరకు నీతిమంతుడైన క్రీస్తు . . . పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడెను”. (1 పేతురు 3:18)
మంచి వార్తలో ఉన్న గొప్ప మంచి – సువార్త – స్వయంగా దేవునితో సహవాసమును ఆనందించడం. దీనిని గూర్చి “మనలను దేవునియొద్దకు తెచ్చుటకు” అనే మాటల ద్వారా 1 పేతురు 3:18 లో స్పష్టంగా చెప్పబడింది. అందుకే యేసు చనిపోయాడు.
సువార్త యొక్క అన్ని ఇతర బహుమతులు దీనిని సాధ్యపరచడానికే ఉన్నాయి.
- మన అపరాధము మనలను దేవుని నుండి దూరం చేయకుండునట్లు మనము క్షమించబడ్డాము.
- మన శిక్ష మనలను దేవుని నుండి దూరం చేయకుండునట్లు మనం నీతిమంతులుగా చేయబడ్డాము.
- మనకు మరియు మన తండ్రిగా ఉన్న దేవునికి మధ్య ఉగ్రత నిలువకుండా ఉండటానికి దేవుడు శాంతింప జేయబడ్డాడు.
- ఎప్పటికీ దేవునితో ఉండే, దేవునిని సంపూర్ణంగా ఆస్వాదించే సామర్థ్యాలు కలిగి ఉండడం కొరకు మనకు ఇప్పుడు నిత్యజీవం ఇవ్వబడింది, పునరుత్థానంలో కొత్త శరీరాలు ఇవ్వబడతాయి.
నీ హృదయాన్ని పరీక్షించుకో. ఎందుకు నీకు క్షమాపణ కావాలి? ఎందుకు నీవు నీతిమంతునిగా తీర్చబడాలని అనుకుంటున్నావు? ఎందుకు దేవుని ఉగ్రతను శాంతింపజేయాలని మీరు కోరుకుంటున్నారు? ఎందుకు నీకు నిత్యజీవం కావాలి? “ఎందుకంటే నేను ఇప్పుడు మరియు ఎప్పటికీ దేవుణ్ణి ఆస్వాదించాలనుకుంటున్నాను” అనేది నీ నిర్ణయాత్మక సమాధానమా?
దేవుడు ఇచ్చే సువార్త-ప్రేమ అంతిమంగా తనను తానే బహుమతిగా ఇచ్చుకోవడం. దీని కోసం మనం సృజించబడ్డాము. మన పాపం వల్ల మనం పోగొట్టుకున్నది ఇదే. క్రీస్తు పునరుద్ధరించింది ఇదే.“నీ సన్నిధిని సంపూర్ణసంతోషము కలదు నీ కుడిచేతిలో నిత్యము సుఖములుకలవు.” (కీర్తన 16:11).