అవమానకరమైన సిలువలో విజయం

అవమానకరమైన సిలువలో విజయం

షేర్ చెయ్యండి:

“అంతేకాదు, ప్రధానయాజకుడు ప్రతి సంవత్సరము తనదికాని రక్తము తీసికొని పరిశుద్ధస్థలములోనికి ప్రవేశించినట్లు, ఆయన [క్రీస్తు] అనేక పర్యాయములు తన్నుతాను అర్పించుకొనుటకు ప్రవేశింపలేదు. అట్లయినయెడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసివచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తియందు తన్నుతానే బలిగా అర్పించుకొనుటవలన పాపనివారణ చేయుటకైయొక్కసారే ప్రత్యక్షపరచబడెను”. (హెబ్రీ 9:25-26)

అలాగని పరలోకంలో పాపులకు స్వాగతం పలుకుతారని మనం ఆయన బలిని తేలిగ్గా తీసుకోకూడదు.

దేవుడు పరిశుద్ధుడు, పవిత్రుడు, పరిపూర్ణ న్యాయవంతుడు, నీతిమంతుడు. అయినా అంతటి గొప్ప, పరిశుద్ధుడైన దేవుడు నీలాంటి, నాలాంటి అపవిత్రమైన వ్యక్తులను తన దయకు పాత్రులనుగా ఎలా స్వాగతిస్తాడన్నదే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మొత్తం కథ. ఇదెలా సాధ్యపడుతుంది?

పాపం కోసం క్రీస్తు బలి అనేది యూదుల ప్రధాన యాజకులు బలులిచ్చినట్లుగా లేదని హెబ్రీ 9:25వ వచనం చెబుతోంది. ప్రజల పాపముల కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి ప్రాణులను బలులివ్వడంతో వారు సంవత్సరానికి ఒకమారు అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించేవారు. అయితే, “ఆయన అనేక పర్యాయములు తన్నుతాను అర్పించుకొనుటకు క్రీస్తు పరలోకంలోనికి ప్రవేశింపలేదు” అని (హెబ్రీ 9:25, 26) ఈ వచనాలు మనకు చెబుతున్నాయి.

యాజకుల నమూనాను క్రీస్తు అనుసరిస్తే, ఆయన సంవత్సరానికి ఒకసారి మరణించవలసి వచ్చేది. ఆదాము హవ్వల పాపాలతో సహా ప్రతి పాపము పరిగణించబడింది కాబట్టి ఆయన లోక పునాది వేయబడిన నాటనుండే ఆయన ప్రతి సంవత్సరం మరణించుటను  ప్రారంభించవలసి వచ్చేది. అయితే, రచయిత దీనిని ఊహించలేని విధంగా పరిగణిస్తున్నాడు.

ఇది ఎందుకు ఊహించలేనిది? ఎ౦దుక౦టే ఇది దేవుని కుమారుని మరణాన్ని బలహీన౦గా, అసమర్థ౦గా చూపిస్తోంది. శతాబ్దాలుగా ఏటేటా పునరావృతం కావాల్సి వస్తే విజయం కలిగినట్లు ఎలా అవుతుంది? దేవుని కుమారుని బలి యొక్క అనంతమైన విలువను మనం ఎక్కడ చూస్తాము? అది ఏటేటా శ్రమ మరియు మరణం అనే అవమానములో కనుమరుగైపోతుంది.

సిలువలో అవమానమున్నది, అయితే అది విజయముతో కూడిన అవమానం. “ఆయన [యేసు] తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనముయొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైయున్నాడు” (హెబ్రీ 12:2)

ఇదే దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త (2 కొరింథీ 4:4). మీరు ఎలాంటి మలినాన్ని అంటించుకున్న లేక ఎటువంటి అపవిత్రమైన పాపం చేసినా, మీరు ఈ మహిమ యొక్క వెలుగును మరియు నమ్మకాన్ని చూడగలుగుతారని నేను ప్రార్థిస్తున్నాను.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...