వర్ణించలేని దేవుని బహుమతి

షేర్ చెయ్యండి:

“ఏలయనగా శత్రువులమై యుండగా, ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన యెడల సమాధానపరచబడిన వారమై, ఆయన జీవించుటచేత మరినిశ్చయముగా రక్షింపబడుదుము. అంతేకాదు; మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా మనము దేవునియందు అతిశయపడుచున్నాము; ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధానస్థితి పొందియున్నాము”. (రోమా 5:10-11)

దేవునిలో సమాధానమును మరియు ఆనందమును మనం నిజంగా ఎలా పొందగలము? మనము యేసు క్రీస్తు ద్వారా మాత్రమే పొందగలము. కనీసం, మనం బైబిల్‌లో యేసు చిత్రపటాన్ని – అంటే, కొత్త నిబంధనలో చిత్రీకరించబడిన యేసు కార్యాలను మరియు బోధలను – దేవునిలో మన ఉల్లాసానికి అవసరమైన విషయముగా మనం చేసుకుంటామని దీనర్థం. క్రీస్తు గురించి తెలుసుకోకుండా దేవునిలో ఆనందించడం ద్వారా క్రీస్తు గౌరవించబడడు. మరియు క్రీస్తు గౌరవించబడని చోట దేవుడు గౌరవించబడడు.

2 కొరింథీ. 4:4-6లో, పౌలు తన మార్పును రెండు విధాలుగా వివరించాడు. 4వ వచనంలో, “దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను” చూడటమే మార్పుగా చెప్పాడు. మరియు 5వ వచనంలో, “దేవునిమహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు” చూడటమే మార్పుగా చెప్పాడు. పైనున్న రెండు సందర్భాలలోనూ మీరు ఆ విషయమును చూడొచ్చు. దేవుని స్వరూపియైన క్రీస్తు మనకు ఉన్నాడు మరియు క్రీస్తులో దేవుడు మనకు ఉన్నాడు.

దేవునిలో సంతోషించుటకు, యేసుక్రీస్తు చిత్రపటంలో దేవుని గురించి మనం చూసి తెలుసుకున్న వాటి గురించి మనం సంతోషిస్తాము. మరియు రోమా ​​5:5 చెప్పినట్లుగా, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాలలో కుమ్మరించబడినప్పుడు దానిని  పూర్తిగా అనుభవించగలుగుతాం. “మనమింక బలహీనులమై యుండగా, క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనులకొరకు చనిపోయెను.” అనే 6వ వచనంలోని చారిత్రక వాస్తవికతను మనం ఆలోచించినప్పుడు, దేవుని ప్రేమ యొక్క మధురమైన, ఆత్మ-ఇచ్చే అనుభవం పొందగలం.

కాబట్టి ఇక్కడ క్రిస్మస్ ను గురించిన అంశం ఇదే. ప్రభువైన యేసుక్రీస్తు మరణం ద్వారా దేవుడు మన సమాధానమును కొనుగోలు చేయడమే కాకుండా (రోమా 5:10), ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆ సమాధానమును పొందేందుకు దేవుడు మనకు సహాయం చేయడమే కాకుండా, ఇప్పుడు కూడా మనం దేవునిలో ఆత్మ వలన, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆనందిస్తున్నాము. (రోమా ​​5:11).

యేసు మన సమాధానమును కొనుగోలు చేశాడు. సమాధానమును స్వీకరించడానికి మరియు బహుమతిని తెరవడానికి యేసు మనకు సహాయం చేశాడు. మరియు యేసు శరీరదారియైన దేవుడుగా స్వయంగా వర్ణించలేని బహుమతిగా ప్రకాశించడం ద్వారా దేవునిలో మన ఆనందాన్ని రేకెత్తించాడు.

ఈ క్రిస్మస్ కి యేసు వైపు చూడండి. ఆయన కొనుగోలు చేసిన సమాధానమును స్వీకరించండి. బహుమతిని తెరవని సెల్ఫ్‌లో ఉంచవద్దు. మరియు మీరు దానిని తెరిచినప్పుడు, దేవునితో సమాధాన పడటానికి దేవుడే బహుమతి అని గుర్తుంచుకోండి.

ఆయనలో సంతోషించు. ఆయనను మీ ఆనందంగా అనుభవించు. ఆయనే మీ సంపద అని తెలుసుకోండి.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...