నా సువార్త ప్రకారము, దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకముచేసికొనుము. (2 తిమోతి 2:8)
యేసును జ్ఞాపకం చేసుకోవడానికి రెండు ప్రత్యేక మార్గాలను పౌలు పేర్కొన్నాడు: ఆయనను మృతులలోనుండి లేచినట్లు గుర్తుంచుకోండి. అతన్ని దావీదు సంతానంగా గుర్తుంచుకోండి. యేసు గురించి ఈ రెండు విషయాలు ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి?
ఎందుకంటే యేసు మృతులలో నుండి లేచినట్లయితే, ఆయన సజీవుడు మరియు మరణంపై – మన మరణంపై కూడా విజయం సాధిస్తాడు.”మృతులలో నుండి యేసును లేపినవాని ఆత్మ మీలో నివసించినయెడల, మృతులలోనుండి క్రీస్తుయేసును లేపినవాడు చావునకులోనైన మీ శరీరములను కూడ మీలో నివసించుచున్న తన ఆత్మద్వారా జీవింపజేయును.” (రోమా 8:11)
అంటే ఎంత తీవ్రమైనబాధలు వచ్చిన, ఈ భూమిపై అవి మహా అయితే నిన్ను చంపుతాయి. ఆ శత్రువు యొక్క ముల్లును యేసు తీసివేసాడు. ఆయన జీవించి ఉన్నాడు. మీరు కూడా సజీవంగా ఉంటారు”. ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి” (మత్తయి 10:28).
కానీ అంతకంటే ఎక్కువగా, యేసు పునరుత్థానం యాదృచ్ఛిక పునరుత్థానం కాదు. దావీదు కుమారుని పునరుత్థానం. “దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకముచేసికొనుము.” పౌలు అలా ఎందుకు చెప్పాడు?
ఎందుకంటే ప్రతి యూదుడికి దాని అర్థం తెలుసు. అంటే యేసు మెస్సీయ అని అర్థం (యోహాను 7:42). ఈ పునరుత్థానం నిత్య రాజు యొక్క పునరుత్థానం అని అర్థం. యేసు తల్లి అయిన మరియతో దేవదూత చెప్పిన మాటలు వినండి:
“ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు;ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును; ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును; ఆయన రాజ్యము అంతములేనిదై యుండునని ఆమెతో చెప్పెను. (లూకా 1:31–33)
కాబట్టి, మీరు సేవించే మరియు మీరు ఎవరి కోసం శ్రమలు పాలవుతున్నారో ఆ యేసును గుర్తుంచుకోవాలి. ఆయన మరణము నుండి సజీవంగా ఉండడం మాత్రమే కాదు, ఆయన శాశ్వతంగా పరిపాలించే రాజుగా సజీవంగా ఉన్నాడు; అతని రాజ్యానికి అంతం ఉండదు. వాళ్ళు మిమ్మల్ని ఏం చేసినా మీరుభయపడాల్సిన అవసరం లేదు. మీరు మళ్లీ జీవిస్తారు. మరియు మీరు ఆయనతో పాటు రాజ్యపాలన చేస్తారు.