అనంతమైన శక్తి కల్గిన మరియు సున్నితమైన రెండు సత్యాలు

అనంతమైన శక్తి కల్గిన మరియు సున్నితమైన రెండు సత్యాలు

షేర్ చెయ్యండి:

“నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనెదననియు చెప్పుకొనుచు ఆదినుండి నేనే కలుగబోవువాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలమునుండి నేనే యింక జరుగనివాటిని తెలియజేయుచున్నాను”. (యెషయా 46:10)

“సార్వభౌమాధికారం” అనే మాట (“త్రిత్వం” అనే పదం లాంటిది) బైబిలులో కనిపించదు. అయితే, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన అతి పెద్ద వ్యక్తి మొదలుకొని అడవిలో ఉండే చిన్న పక్షి వరకు అందరి మీద, అన్నిటి మీద దేవుడు ఒక్కడే అంతిమ నియంత్రణను కలిగి ఉంటాడనే సత్యాన్ని సూచించడానికి మనం “సార్వభౌమాధికారం” అనే మాటను ఉపయోగిస్తాం.

ఈ విషయాన్ని బైబిల్ ఎలా చెబుతుందో చూడండి: “…. దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు నేను దేవుడను నన్ను పోలినవాడెవడును లేడు. నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనెదను … ” (యెషయా 46:9-10). “ఆయన పరలోక సేనయెడలను భూనివాసులయెడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు; ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడుకాడు” (దాని 4:35). “అయితే ఆయన ఏకమనస్సుగలవాడు ఆయనను మార్చగలవాడెవడు? ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయును. నాకు విధింపబడినదానిని ఆయన నెరవేర్చును అట్టి పనులను ఆయన అనేకముగా జరిగించువాడైయున్నాడు” (యోబు 23:13-14). “మా దేవుడు ఆకాశమందున్నాడు తన కిచ్ఛవచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు” (కీర్తన 115:3).

ఈ సిద్ధాంతం విశ్వాసులకు ఎంతో శ్రేష్టమైనదని చెప్పడానికిగల ఒక కారణం ఏంటంటే, దేవుడు తనను నమ్మిన ప్రతి ఒక్కరికి ఆయన తన కరుణను, దయను చూపించడమే దేవునికున్న గొప్ప ఆశ అని మనకు తెలిసి ఉండడమే (ఎఫెసీ 2:7; కీర్తన 37:3-7; సామెతలు 29:25). దేవుని సార్వాభౌమాధికారం అంటే మన కోసం చేసిన ఈ రూపకల్పన (డిజైన్) ఆశాభంగం కాదు అని అర్థం. ఈ డిజైన్ విఫలమవ్వదు.

“దేవుణ్ణి ప్రేమించేవారికి” మరియు “ఆయన ఉద్దేశానుసారంగా పిలువబడినవారికి” ఏ హాని జరగదు, ఖచ్చితంగా జరగదు; లోతైన, ఉన్నతమైన మరియు సుదీర్ఘమైన మంచి కోసమే మనకు సమస్తం సమకూడి జరుగుతాయి (రోమా 8:28; కీర్తన 84:11).

ఇందుచేతనే, దేవుని సార్వభౌమాధికారం మరియు దేవుని కరుణ అనేవి నా జీవితమలో రెండు స్తంభాలని చెప్పడానికి నేను ఇష్టపడతాను. అవి రెండూ నా భవిష్యత్తుకు నిరీక్షణగా, నా సేవకు శక్తిగా, నా వేదాంతానికి కేంద్రంగా, నా వివాహానికి బంధంగా, నా అనారోగ్యములన్నిటిలో ఉత్తమ ఔషధంగా, నాకు కలిగే నిరుత్సాహములన్నిటిలోను విరుగుడుగా ఉన్నాయి.

(త్వరగానైనా, ఆలస్యంగానైనా) నేను చనిపోయే సందర్భంలో, ఈ రెండు సత్యాలు నా పడక ప్రక్కనే నిలిచి ఉండి, దేవుని వద్దకు వెళ్ళడానికి అనంతమైన శక్తితో, సున్నితమైన చేతులతో నన్ను పైకి లేపుతాయి.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...