క్రిస్మస్ యొక్క రెండు లక్ష్యాలు

షేర్ చెయ్యండి:

“చిన్న పిల్లలారా, యెవనిని మిమ్మును మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడైయున్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి; అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను”. (1 యోహాను 3:7–8)

1 యోహాను 3:8, “అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను.” అని చెప్పినప్పుడు, ఆయన మనస్సులో ఉన్న “అపవాది పనులు” ఏమిటి? ఈ సందర్భం చదివితే సమాధానం దొరుకుతుంది.

మొదటిది, 1 యోహాను 3:5 పై వాక్యానికి సమానమైన వాక్యం: “పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయెనని మీకు తెలియును;” 5వ వచనంలో మరియు 8వ వచనంలో “ఆయన ప్రత్యక్షమాయెనని” ఉంది. కాబట్టి యేసు నాశనం చేయడానికి వచ్చిన “అపవాది యొక్క క్రియలు” చాలావరకు పాపాలు. 8వ వచనంలోని మొదటి భాగం దీనిని నిర్ధారిస్తుంది: “అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి;”

ఈ సందర్భంలో అనారోగ్యం లేదా విరిగిన కార్లు లేదా గందరగోళ షెడ్యూల్‌లు కాదు గాని పాపమే సమస్య. మనం పాపం చేయడం మానివేయడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు.

1 యోహాను 2:1లోని సత్యంతో పాటు ఈ సత్యాన్ని ఉంచినట్లయితే మనం దీనిని మరింత స్పష్టంగా చూస్తాము: “నాచిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై యీ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసినయెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రియొద్ద మనకున్నాడు.” ఇది క్రిస్మస్ యొక్క గొప్ప ఉద్దేశాలలో ఒకటి – మానవునిగా మారిన గొప్ప ఉద్దేశాలలో ఒకటి (1 యోహాను 3:8).

అయితే 1 యోహాను 2:1–2లో యోహాను జోడించిన మరో ఉద్దేశ్యం ఉంది, “ఎవడైనను పాపము చేసినయెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రియొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై యున్నాడు; మన పాపములకు మాత్రమేకాదు. సర్వలోకమునకును శాంతికరమై యున్నాడు.”

అయితే ఇప్పుడు దీనర్థం ఏమిటో చూడండి: యేసు ఈ లోకంలో రెండు కారణాల వల్ల కనిపించాడని అర్థం. మనము పాపము చేయకుండునట్లు ఆయన వచ్చెను – అనగా అపవాది కార్యములను నశింపజేయుటకు వచ్చెను (1 యోహాను 3:8); మరియు మనం పాపం చేస్తే మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడానికి ఆయన వచ్చాడు. ఆయన మన పాపాల విషయంలో దేవునికున్న కోపాన్ని తీసివేసే ప్రత్యామ్నాయ బలిగా వచ్చాడు.ఈ రెండవ లక్ష్యం యొక్క ఉద్దేశ్యం మొదటి లక్ష్యాన్ని ఓడించడం కాదు. క్షమాపణ అనేది పాపాన్ని అనుమతించడానికి కాదు. క్రీస్తు మన పాపాలకు మరణించడానికి కారణం పాపానికి వ్యతిరేకంగా మన పోరాటాన్ని సడలించడానికి కాదు. క్రిస్మస్ లోని ఈ రెండు లక్ష్యాల యొక్క ఉద్ధేశ్యం ఏమిటంటే, ఒకసారి మన పాపాలన్నింటికీ వెల చెల్లించడం ద్వారా మనము స్వేచ్ఛను మరియు శక్తిని పొందుకుంటాము. రక్షణను సంపాదించుకోగలమనే న్యాయవాదములో ఉన్నవారు ఆలోచించునట్లుగా కాక, మరియు రక్షణ కోల్పోతామనే భయంతో కాకుండా, మన ప్రాణాలను బలిగొన్నప్పటికీ, ఆత్మవిశ్వాసంతో మరియు ఆనందంతో పాపానికి వ్యతిరేకంగా జరిగే యుద్ధంలో మనల్ని మనం విజేతలుగా పాపంతో పోరాడటానికి వీలు కల్పిస్తుంది.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...