నిజమైన జ్ఞానం గొప్ప ఆనందాన్ని తీసుకువస్తుంది

నిజమైన జ్ఞానం గొప్ప ఆనందాన్ని తీసుకువస్తుంది

షేర్ చెయ్యండి:

“ఆ తరువాత జనులు తమకు తెలియజేయబడిన మాటలన్నిటిని గ్రహించి … సంభ్రమముగా ఉండుటకును ఎవరి యిండ్లకు వారు వెళ్లిరి”. (నెహెమ్యా 8:12)

దేవుని విలువను మరియు దేవున్ని మహిమపరిచే ప్రేమలోని ఉత్సాహమును ప్రతిబింబించే ఆనందం కేవలం దేవుని నిజమైన జ్ఞానంలోనే వేరుపారి ఉంటుంది. అలాగే దేవుని జ్ఞానం మనకు తక్కువగాను లోపముగానుఉన్నట్లయితే, మన ఆనందం కూడా అంతే తక్కువగా ఉంటుంది.

నెహెమ్యా 8:12వ వచనంలో ఇశ్రాయేలీయులకు కలిగిన అనుభవం ద్వారా హృదయంలో దేవున్ని మహిమపరిచే ఆనందం ఎలా కలుగుతుందనేందుకు ఒక నమూనాగా ఉంది. దేవుని వాక్యాన్ని ఎజ్రా చదివి, వారికి వినిపించాడు, లేవీయులు వాటిని వివరించారు. ఆ తరువాత, ప్రజలు “సంభ్రముగా ఉండుటకు” వెళ్ళిరి.

వారు దేవుని నిజమైన మాటలను అర్థం చేసుకున్నారు కాబట్టి వారు గొప్పగా సంతోషించారు.

దేవుని వాక్యం మనకు బోధించబడినప్పుడు ఆనందంతో హృదయాలు రగిలిన అనుభవాన్ని మనలో చాలామంది రుచి చూసే ఉంటారు (లూకా 24:32). వారి సంతోషం కోసమే యేసు వారికి బోధించాడని తన శిష్యులతో ఆయన రెండుసార్లు చెప్పాడు.

  • యోహాను 15:11 – “మీయందు నా సంతోషము ఉండవలెననియు, మీ సంతోషము పరిపూర్ణము కావలెననియు, ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను.
  • యోహాను 17:13 – “ఇప్పుడు నేను నీయొద్దకు వచ్చుచున్నాను; నా సంతోషము వారియందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను.

దేవున్ని తెలుసుకోవడానికి మరియు ఆయనయందు ఆనందించడానికి ప్రభువే, దేవుడే తననుతాను అర్పించుకోవడం అనేది ఈ మాటలో మనం గమనించాల్సిన ప్రధాన అంశమైయున్నది. “షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచు వచ్చెను” (1 సమూయేలు 3:21).

ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, మన ఆనందం దేవుని మహిమను ప్రతిబింబించాలంటే, దేవుడు ఎంత గొప్ప మహిమగలవాడనే నిజమైన జ్ఞానం నుండి అది ప్రవహించాలి. మనం దేవున్ని సరిగ్గా ఆస్వాదించాలంటే, ఆయనను నిజంగా తెలుసుకునే తీరాలి.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...