విశ్వాసయుక్తమైన కార్యమునకు  మూడు ఉదాహరణలు

విశ్వాసయుక్తమైన కార్యమునకు  మూడు ఉదాహరణలు

షేర్ చెయ్యండి:

“మేలు చేయవలెనని మీలో కలుగు ప్రతి యాలోచనను, విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయుచు, మనదేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచునట్లు మీకొరకు ఎల్లప్పుడును ప్రార్థించుచున్నాము”. (2 థెస్సలొనీకయులు 1:12)

విశ్వాసంతో జరిగించే మన మంచి నిర్ణయాలను దేవుడు తన బలం ద్వారా నెరవేరుస్తాడని పౌలు చెప్పినప్పుడు (మన చర్యలను “విశ్వాసయుక్తమైన కార్యము” అని పిలుస్తున్నాడు), విశ్వాసం ద్వారా రాబోయే ఐదు నిమిషాలు, ఐదు నెలలు, ఐదు దశాబ్దాలు మరియు శాశ్వతత్వంలో క్రీస్తులో దేవుడు మనకు ఏమై ఉంటాడని వాగ్దానం చేశాడో వాటన్నింటిలో  సంతృప్తి చెందడం ద్వారా మనం పాపాన్ని ఓడిస్తాము మరియు మనం నీతిని నెరవేరుస్తాము అని అర్ధం. 

మీ జీవితంలో ఇది ఎలా ఉంటుందో ఇక్కడ మూడు ఉదాహరణలు ఇస్తున్నాను:

1. మీరు త్యాగపూరితంగా, ఉదారంగా ఇవ్వడానికి మీ హృదయంలో నిర్ణయించుకుంటే, “దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. (ఫిలిప్పీయులు 4:19)” మరియు “సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటకోయును” (2 కొరింథీయులు 9:6) మరియు “అన్నిటియందు ఎల్లప్పుడును మీలో మీరు సర్వసమృద్ధిగలవారై ఉత్తమమైన ప్రతికార్యము చేయుటకు దేవుడు మీయెడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు.” (2 కొరింథీయులు 9:8) అనే వాగ్దానాల విషయంలో మీరు ఆయన భవిష్యత్తు కృపను విశ్వసిస్తే ఈ సంకల్పాన్ని నెరవేర్చే దేవుని బలం మీకు వస్తుంది.

2. మీరు అశ్లీల చిత్రాలను త్యజించటానికి మీ హృదయంలో నిర్ణయించుకుంటే, “హృదయశుద్ధిగలవారు ధన్యులు; వారు దేవుని చూచెదరు” (మత్తయి 5:8), “నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండ నీ అవయవములలో నొకటి నశించుట నీకు ప్రయోజనకరముగదా” (మత్తయి 5:29) అనే వాగ్దానం విషయంలో ఆయన భవిష్యత్తు కృపను మీరు విశ్వసిస్తే, ఈ సంకల్పాన్ని నెరవేర్చడానికి దేవుని బలం మీకు వస్తుంది. ఇది పరిపూర్ణ సంతృప్తికరమును ఇచ్చే ప్రయోజనకరమైన విషయం. 

3. మీరు అవకాశం వచ్చినప్పుడు క్రీస్తు కోసం మాట్లాడటానికి హృదయంలో నిర్ణయించుకుంటే, “ఏలాగు మాటాడుదుము? ఏమి చెప్పుదుము? అని చింతింపకుడి; మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకనుగ్రహింపబడును” (మత్తయి 10:19) అనే వాగ్దానం విషయంలో ఆయన భవిష్యత్తు కృపను మీరు విశ్వసిస్తే, ఈ సంకల్పాన్ని నెరవేర్చడానికి దేవుని బలం మీకు వస్తుంది.దేవుని అమూల్యమైన వాగ్దానాలపై అంటే తరగని, రక్తంతో కొనుగోలు చేసిన, క్రీస్తు-ఉన్నతమైన భవిష్యత్తు కృపకు సంబంధించిన ఆయన వాగ్దానాలపై దేవుడు మన రోజువారీ విశ్వాసాన్ని పెంచును గాక.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...