విజయం తధ్యం (ఖచ్చితం)

విజయం తధ్యం (ఖచ్చితం)

షేర్ చెయ్యండి:

బలిష్ఠులైన జనులు నిన్ను ఘనపరచెదరు భీకర జనముల పట్టణస్థులు నీకు భయపడుదురు”. (యెషయా 25:3)

ఇశ్రాయేలు దేవుడైన యెహోవాతోనూ, మనం తెలుసుకున్న దేవుని మెస్సయ్యా అయినటువంటి యేసుతోనూ సమస్త దేశములు, అంటే సమస్త జనాంగముల ప్రతినిధులు ఇక ఎన్నటికీ ఎటువంటి భేదాలను కలిగియుండరని యెషయా భక్తుడు చూస్తున్నాడు.

వారిక బయలు, నెబో, మొలెకు, అల్లా, బుద్ధ, ఆదర్శధామ సామాజిక కార్యక్రమాలు, పెట్టుబడిదారి వృద్ధి అవకాశాలు, పూర్వీకులు, లేక ప్రకృతి ప్రాణుల ఆత్మలు అనేవాటిని ఇక ఎన్నటికి ఆరాధన చేయరు. దానికి బదులుగా, వారందరూ దేవుని పర్వతం మీద జరగబోవు విందుకు విశ్వాసంతో వస్తారు.

వారి దుఃఖపు ముసుగు తీసివెయబడుతుంది, మరణం మింగివేయబడుతుంది, దేవుని ప్రజల నింద తీసివేయబడుతుంది మరియు వారి కన్నీరు శాశ్వతంగా తుడిచివేయబడుతుంది.

ఇది, “బలిష్ఠులైన జనులు నిన్ను ఘనపరచెదరు భీకర జనముల పట్టణస్థులు నీకు భయపడుదురు” (యెషయా 25:3) అనే వచనం యొక్క దర్శనాన్ని అర్థం చేసుకోవడానికి ఉన్నటువంటి నేపథ్యం. మరొక విధంగా చెప్పాలంటే, “బలిష్ఠులైనవారికంటే” దేవుడే బలవంతుడు మరియు ఆయన బహు శక్తిమంతుడు మరియు ఆఖరిలో ఆయనను ఘనపరచడానికి భీకర జనముల పట్టణస్థులను మార్చగల కృపా కనికరముగల దేవుడైయున్నాడు.

అందుచేత, దేవుణ్ణి ఆరాదించడానికి సమస్త దేశాలు ఆయనవైపు తిరిగాయని, ప్రజలందరి కోసం గొప్ప విందు ఉన్నదని, ఆయన ప్రజలుగా మారిన దేశాల నుండి నింద, శ్రమ, దుఃఖాలను తీసివేశాడని మరియు చివరిగా, మరణాన్ని శాశ్వతంగా ఎత్తివేశాడని యెషయా భక్తుడు మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాడు.

ఈ విజయం తధ్యం, ఎందుకంటే ఈ కార్యమును దేవుడే చేస్తున్నాడు. అందుచేత, ఇది జరుగుతుందని మనం ఖచ్చితంగా చెప్పగలం.

ప్రపంచ సువార్తికరణ కోసం గడిపిన ఒక్క జీవితం కూడా వృధా కాదు. ఒక్క ప్రార్థన, ఒక్క రూపాయి, ఒక్క ప్రసంగం, ప్రోత్సాహమందించే ఒక్క లెటర్, చీకట్లో ఒక చిన్న వెలుగు కాంతి, ఇలా దేవుని రాజ్య వ్యాపకానికి సంబంధించిన ఏ చిన్న పని చేసినా అది వ్యర్థం కాదు.

విజయం తధ్యం (ఖచ్చితం).

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...