పాపాన్ని ఓడించే సంతృప్తి

పాపాన్ని ఓడించే సంతృప్తి

షేర్ చెయ్యండి:

“అందుకు యేసు వారితో ఇట్లనెను జీవాహారము నేనే; నాయొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు”. (యోహాను 6:35)

దేవుడు క్రీస్తులో మన కోసం ఏమై ఉన్నాడో అనే దానిలో సంతృప్తి చెందడమే విశ్వాసం యొక్క సారాంశం అని ఇక్కడ మనం అర్ధం చేసుకోవాలి.

విశ్వాసాన్ని ఈ విధంగా నిర్వచించడం ద్వారా రెండు విషయాలను మనము నొక్కి చెబుతున్నాము. ఒకటి విశ్వాసం యొక్క దైవ కేంద్రీకృత. కేవలం దేవుని వాగ్దానాలు మాత్రమే మనలను సంతృప్తిపరచవు. దేవుడు యేసులో మనకు ఏమై ఉన్నాడో అవన్నీ మనకు సంతృప్తినిస్తాయి. దేవుడు వాగ్దానం చేసిన బహుమానాలు మాత్రమే కాదు. క్రీస్తులోని దేవుణ్ణి మన నిధిగా విశ్వాసం స్వీకరించింది.

విశ్వాసం యొక్క నిరీక్షణ రాబోయే యుగం యొక్క స్థిరాస్తిపై మాత్రమే కాకుండా, దేవుడు అక్కడ ఉంటాడనే వాస్తవంపై ఆధారపడి ఉంది (ప్రకటన 21:3). “అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును.”

ఇప్పుడు కూడా విశ్వాసం కేవలం క్షమించబడిన పాపాల వాస్తవికతను మాత్రమే కాదు (అది విలువైనది), కానీ మన హృదయం సజీవమైన క్రీస్తు ఉనికిని మరియు దేవుని సంపూర్ణతను అత్యంత యాదార్ధంగా స్వీకరిస్తుంది. “క్రీస్తు మీ హృదయములలో విశ్వాసముద్వారా నివసించునట్లుగాను, . . .  మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా” అని ఎఫెసీ 3:17–19లో పౌలు ప్రార్థిస్తున్నాడు.

యేసులో దేవుడు మనకొరకు ఏమైఉన్నాడో దానియందు సంతృప్తిగా ఉండడమే విశ్వాసము అని నిర్వచించడంలో నొక్కిచెప్పబడిన మరొక విషయం “సంతృప్తి” అనే పదం. విశ్వాసం అనేది దేవుని ఊట వద్ద ఆత్మ యొక్క దాహాన్ని తీర్చుకోవడం. యోహాను 6:35లో “విశ్వాసం” అంటే “జీవాహారము” అయిన యేసును తినుటకును మరియు “జీవజలము” అయిన యేసును త్రాగుటకు (యోహాను 4:10, 14) “రావడం” అని మనం చూస్తాము. పాపపు ఆకర్షణల బానిస శక్తిని విచ్ఛిన్నం చేసే విశ్వాసం యొక్క శక్తి యొక్క రహస్యం ఇక్కడ ఉంది. యేసులో దేవుడు మనకొరకు ఏమై ఉన్నాడో దానియందు హృదయమును సంతృప్తిపరచినట్లయితే, క్రీస్తు జ్ఞానము నుండి వేరు చేయడానికి మనలను ఆకర్షించే పాపపు శక్తి విరిగిపోతుంది.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...