సమృద్ధి యొక్క ఉద్దేశ్యం

సమృద్ధి యొక్క ఉద్దేశ్యం

షేర్ చెయ్యండి:

“దొంగిలువాడు ఇకమీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలుకలుగు నిమిత్తము తన చేతులతో మంచి పనిచేయుచు కష్టపడవలెను”. (ఎఫెసీ 4:28)

భౌతికమైన వాటితో ఎలా జీవించాలో మూడు స్థాయిలు ఉన్నాయి: (1) వాటిని పొందడానికి మీరు దొంగిలించవచ్చు; (2) లేదా వాటిని పొందడానికి మీరు పని చేయవచ్చు; (3) లేదా వాటిని ఇవ్వడానికి మీరు పని చేయవచ్చు.

చాలా మంది, క్రైస్తవులమని చెప్పుకునేవారు రెండవ స్థాయిలో నివసిస్తున్నారు. మనము దొంగతనం మరియు పనిపాటు లేకుండా తిరిగేవారికి భిన్నంగా పనిని గౌరవిస్తాం. మనం దొంగతనాలు మరియు పనిపాటు లేకుండా తిరగడాన్ని తిరస్కరించి, నిజాయితీగా పని చేసుకొని నిజాయితీగా రోజుకి రావలసిన వేతనం తీసుకుంటే మనం ధర్మంగా వ్యవహరించినట్లు భావిస్తాము. అది చెడ్డ విషయమేమి కాదు. దొంగతనం మరియు పనిపాటు లేకుండా తిరిగడం కంటే పని చేయడం మంచి విషయం. కానీ అపొస్తలుడు మనల్ని దానికొరకు పిలవడం లేదు.

మన సంస్కృతిలో ఉన్న ప్రతి ఒక్కరూ రెండవ స్థాయిపై జీవించమని మనల్ని ప్రోత్సహిస్తారు: సంపాదించడానికి  పని చేయండి. కానీ బైబిల్ మనల్ని కనికరం లేకుండా మూడవ స్థాయికి నెట్టివేస్తుంది: ఇవ్వడానికి పని చేయండి. “మరియు అన్నిటియందు ఎల్లప్పుడును మీలో మీరు సర్వసమృద్ధిగలవారై ఉత్తమమైన ప్రతికార్యము చేయుటకు దేవుడు మీయెడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు.” (2 కొరింథీయులు 9:8).

దేవుడు మనకు సమృద్ధిని ఎందుకు అనుగ్రహిస్తాడు? మనం జీవించడానికి తగినంత ఉంచుకొని, ఆపై మిగిలిన వాటిని ఆధ్యాత్మిక భౌతిక దుఃఖాన్ని అంటే తాత్కాలిక మరియు శాశ్వతమైన బాధలను తగ్గించే అన్ని రకాల మంచి పనుల కోసం ఉపయోగించవచ్చు. సరిపోయినంత మనకు; మరియు సమృద్ధి ఇతరులకు. . . . 

ఒక వ్యక్తి ఎంత సంపాదిస్తున్నాడనేది సమస్య కాదు. పెద్ద పరిశ్రమలు మరియు పెద్ద జీతాలు మన కాలానికి సంబంధించిన వాస్తవాలు మరియు అవి తప్పనిసరిగా చెడు కాదు. పెద్ద జీతంతో విలాసవంతంగా జీవించాలి అని  భావించి మోసపోవడమే దుర్మార్గం.

దేవుడు మనలను తన కృపకు పనిముట్లుగా చేసాడు. ఆ పనిముట్లుగా ఉండడం వలన బంగారం మనతో ఉంటుంది అని ఆలోచించడంలో ప్రమాదం ఉంది. బంగారం ఉండదు. రాగి ఉండొచ్చు. రాగి నమ్మశక్యం కాని సంపదను ఇతరులకు చేరవేస్తుంది. మరియు ఆ ఇచ్చే ప్రక్రియలోనే మనం గొప్ప ఆశీర్వాదాన్ని పొందుతాము (అపొస్తలుల కార్యములు 20:35).

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...