ఆచరణాత్మక ప్రేమకు గల శక్తివంతమైన కారణం

షేర్ చెయ్యండి:

“మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములోనుండి జీవములోనికి దాటియున్నామని యెరుగుదుము”. (1 యోహాను 3:14)

కాబట్టి, ప్రేమ అనేది మనం క్రొత్తగా జన్నించామనడానికి అంటే మనం క్రైస్తవులమనడానికి, మనం రక్షింపబడ్డామనడానికి సాక్ష్యం.

మన పవిత్రత మరియు ప్రజల పట్ల మనకున్న ప్రేమ కొన్నిసార్లు బైబిల్ మన రక్షణకి గుర్తులుగా చూపిస్తుంది. మరో మాటలో చెప్పాలంటే, మనం పవిత్రంగా లేకుంటే మరియు ప్రేమించకపోతే, తీర్పు రోజున మనం రక్షించబడము (ఉదా., హెబ్రీయులు 12:14; గలతీయులు 5:21; 1 కొరింథీయులు 6:10). దేవునితో మనల్ని మనం సరిచేసుకొని  ప్రేమతో కొన్ని పనులు చేయడమని దీని అర్థం కాదు. కానేకాదు, ఎఫెసీయులకు 2:8-9 చెప్పినట్లుగా బైబిల్ మళ్లీ మళ్లీ స్పష్టంగా చెబుతుంది ఏంటంటే, “మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియలవలన కలిగినదికాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు”. మనం విశ్వాసం ద్వారా రక్షింపబడ్డామని బైబిలు చెప్పి, మరలా రక్షింపబడాలంటే మనం ప్రజలను ప్రేమించాలి అని చెప్పినప్పుడు దేవుని వాగ్దానాలపై విశ్వాసం ఎంత వాస్తవంగా ఉండాలి అంటే దాని ద్వారా వచ్చే ప్రేమ, విశ్వాసం యొక్క వాస్తవికతను రుజువు చేయాలి.

కాబట్టి, ఇతరుల పట్ల ప్రేమ అనేది భవిష్యత్ కృపకు మూలం అంటే ప్రేమ ప్రాథమిక షరతైన విశ్వాసం నిజమైనదని నిర్ధారిస్తుంది. మనం ఇతరుల పట్ల చూపించే ప్రేమ రెండవ షరతు. ఇది విశ్వాసం యొక్క ప్రాధమిక మరియు ఆవశ్యక స్థితి యొక్క ప్రామాణికతను నిర్ధారిస్తుంది, ఇది మనలను క్రీస్తుతో ఏకం చేస్తుంది మరియు ఆయన శక్తిని పొందేలా చేస్తుంది.

భవిష్యత్ కృప యొక్క వాగ్దానాలలో ఉన్న దేవుని మహిమను విశ్వాసం గ్రహిస్తుంది మరియు వాగ్ధానాలు బయలుపరిచిన సత్యం ‘దేవుడు యేసులో మనకు ఏమైయున్నాడో’ ఆ సత్యాన్ని విశ్వాసం స్వీకరిస్తుంది. దేవుని మహిమను చూడగలిగే ఆధ్యాత్మిక దృష్టి మరియు దానిలో మనము ఆనందించగలగడం, దేవుడు తన కృపకు లబ్ధిదారులుగా ఉండేందుకు మనల్ని పిలిచాడనడానికి సాక్ష్యం. ఈ సాక్ష్యం దేవుని వాగ్దానాలు మన స్వంత వాగ్దానాలుగా వాటి మీద నిరీక్షణ ఉంచేలా చేస్తుంది. మరియు ప్రేమించేందుకు శక్తినిస్తుంది. ఇది మన విశ్వాసం నిజమైనదని నిర్ధారిస్తుంది.

రెండు విషయాలను మిళితం చేసే విశ్వాసం కోసం ప్రపంచం తహతహలాడుతోంది: అచంచలమైన దైవిక సత్యం యొక్క విస్మయపరిచే దృశ్యం మరియు జీవితంలో విముక్తి కలిగించే మార్పుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్న ఆచరణాత్మక శక్తి. నేను కూడా కోరుకునేది అదే. అందుకే నేను క్రైస్తవుడిని.తనను విశ్వసించే నిస్సహాయ ప్రజలకు వాగ్దానాలు నెరవేర్చడం ద్వారా తన అనంత సౌందర్యాన్ని మరియు స్వయం సమృద్ధిని గొప్పగా చూపించే గొప్ప కృప గల దేవుడు ఉన్నాడు. మరియు ఈ దేవుణ్ణి బహుమానంగా చేసుకోవడం వలన వచ్చిన శక్తి ఉంది, అది జీవితంలోని దేనిని కూడా తాకకుండా వదిలివేయదు. ఇది అత్యంత ఆచరణాత్మక మార్గాల్లో ప్రేమించేందుకు మనకు శక్తినిస్తుంది.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...