“ఇదియుగాక అపొస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరియందు అధికముగా ఉండెను”. (అపొ. కార్య 4:33)
ఏదో ఒక వ్యతిరేకమైన అపాయకరమైన పరిస్థితిలో మనం చేసే పరిచర్య క్రీస్తుకు సాక్ష్యమివ్వాలనుకుంటే దానికి కావాల్సింది మన తెలివితేటలు కాదు గాని సమృద్ధిగా ఉండే భవిష్యత్తులోని కృప.
ప్రజల౦దరిలో పునరుత్థానుడైన క్రీస్తు కోసం బలవంతంగా సాక్ష్యమివ్వడానికి అపొస్తలులకు ఎటువంటి సహాయం అవసరవం లేదు. సుమారు మూడేళ్లు వారు ఆయనతోపాటు ఉన్నారు. ఆయన చనిపోవడం కళ్ళార చూశారు. ఆయన సిలువ వేయబడిన తర్వాత ఆయనను సజీవునిగా చూశారు. వారికి కావాల్సిన “అనేక రుజువులు” వారు కలిగియున్నారు (అపొ. కార్య 1:3). ఆ తొలి రోజుల్లోనే ప్రజల౦దరి మధ్యన వారి సాక్ష్య పరిచర్య అప్పటికే జరిగిన అద్భుతాల సాక్ష్యంతో ఎంతో తాజాగా ఉండేదని మీరు అనుకోవచ్చు.
అయితే, అపొస్తలుల కార్యముల గ్రంథం మనకది చెప్పట్లేదు. నమ్మక౦తోను, ప్రభావ౦తోను సాక్ష్యమిచ్చే శక్తి ప్రధాన౦గా కృపకు సంబంధించిన గతపు జ్ఞాపకాల ను౦డి రాలేదు గాని అది “దైవ కృప” యొక్క క్రొత్త విధానాల నుండి వచ్చింది. “దైవ కృప అందరియందు అధికముగా ఉండెను.” ఆ విధంగా అపొస్తలుల విషయ౦లో దేవుని కృప అనుగ్రహించబడింది, ఆ విధంగానే మన సాక్ష్య పరిచర్యలో మనతో కూడా ఉంటుంది.
అద్భుతాలు, సూచక క్రియలు ఏమి జరిగినా, క్రీస్తుకు మనమిచ్చే సాక్ష్యాన్ని పె౦పొ౦ది౦చడానికి దేవుడు వాటిని స్తెఫను విషయంలో జరిగించిన రీతిలోనే మనయందు జరిగిస్తూ ఉండవచ్చు. “స్తెఫను కృపతోను బలముతోను నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను” (అపొ. కార్య 6:8). స్తెఫనుకు కావల్సినవన్నిటి కోసం, చివరికి తను మరణించడానికి కూడా దేవుని నుండి కృప అనుగ్రహించబడియుండెను.
ప్రత్యేక పరిచర్యకు అవసరమైన క్లిష్ట సందర్భాలలో మనం ఆధారపడే అసాధారణమైన భవిష్యత్తుకు సంబంధించిన కృప మరియు శక్తి మనకుంది. ఇది దేవుని ద్వారా జరిగించబడే శక్తితో కూడిన చర్య. తద్వారా, దేవుడు “కృపా వాక్యమునకు సాక్ష్యమిప్పించుచుండెను” (అపొ. కార్య 14:3; హెబ్రీ 2:4 వచనాన్ని కూడా చూడండి). నిరంతరం లభించే శక్తితో కూడిన కృప ఎల్లప్పుడూ ఉండే సత్య కృపకు సాక్ష్యంగా నిలుస్తుంది.