“ఆయన వారికొరకు ఒక పట్టణము సిద్ధపరచియున్నాడు”. (హెబ్రీ 11:16)
కాలుష్యం ఉండదు,గోడమీద రాతలు ఉండవు, చెత్త ఉండదు, పెయింట్ ఎక్కడపడితే అక్కడ ఉండదు లేదా కుళ్ళిన గ్యారేజీలు ఉండవు, చచ్చిన గడ్డి లేదా విరిగిన సీసాలు ఉండవు, కఠినమైన వీధి చర్చలు ఉండవు, ముఖాముఖి ఘర్షణలు ఉండవు, గృహ కలహాలు లేదా హింస, రాత్రి సమయంలో ప్రమాదాలు ఉండవు, అగ్నిప్రమాదాలు ఉండవు, అబద్ధం చెప్పడం లేదా దొంగిలించడం లేదా చంపడం, విధ్వంసం మరియు వికారాలు ఉండవు.
దేవుని పట్టణము పరిపూర్ణంగా ఉంటుంది, ఎందుకంటే దేవుడు అందులో ఉంటాడు. ఆయన దానిలో నడుస్తాడు మరియు దానిలో మాట్లాడతాడు మరియు దానిలోని ప్రతి భాగంలో తనను తాను ప్రత్యక్ష పరచుకుంటాడు. మంచివి, అందమైనవి, పవిత్రమైనవి, శాంతియుతమైనవి, నిజమైనవి మరియు సంతోషకరమైనవియు ప్రతిదీ అక్కడ ఉంటుంది ఎందుకంటే దేవుడు అక్కడ ఉంటాడు.
పరిపూర్ణ న్యాయం ఉంటుంది మరియు ఈ లోకంలో క్రీస్తుకు విధేయత చూపడం ద్వారా అనుభవించిన ప్రతి బాధకు వెయ్యి రెట్లు ప్రతిఫలం ఉంటుంది. అది ఎప్పటికీ క్షీణించదు. వాస్తవానికి, నిత్యత్వం ఆనందం పెరుగుతూ ఉండే అంతులేని యుగాలలోకి విస్తరిస్తున్న కొలది ఆ పట్టణం మిక్కిలి ప్రకాశవంతంగా ప్రకాశిస్తుంది.
మీరు భూమిపై ఉన్న అన్నిటికంటే ఈ నగరాన్ని కోరుకోవడం ద్వారా, హెబ్రీ 11:10 ప్రకారం, పట్టణము రూపకర్త మరియు నిర్మాణకుడు అయిన దేవుణ్ణి మీరు ఘనపరుస్తున్నారు. దేవుడు మహిమ పరచబడినప్పుడు, ఆయన సంతోషిస్తాడు మరియు మీ దేవుడు అని పిలవబడటానికి సిగ్గుపడడు.