“మీరు నాకు కీడుచేయనుద్దేశించితిరిగాని నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రదికించునట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను.” (ఆది 50:20)
ఆదికాండం 37-50 అధ్యాయాలలో ఉన్నటువంటి యోసేపు కథ, దేవుడు అనుగ్రహించే భవిష్యత్తు కృపలోను, సార్వభౌమధికారములోను మనం విశ్వాసం కలిగియున్నామనుటకు ఒక గొప్ప పాఠం.
యోసేపు తన సహోదరుల ద్వారా బానిసత్వంలోనికి అమ్మబడతాడు, ఇది అతనికున్న సహనాన్ని విపరీతంగా పరీక్షించి ఉండాలి. అయితే, అతనికి ఐగుప్తులో పోతిఫరు ఇంటిలో ఒక మంచి ఉద్యోగం దొరికింది. ఆ తర్వాత, విధేయతన్నది లేనటువంటి ప్రదేశంలో నిజాయితీగా ప్రవర్తిస్తున్నప్పుడు, పోతిఫర్ భార్య అతని నిజాయితీ గురించి అబద్ధం చెబుతుంది మరియు అతన్ని జైలుకు పంపుతుంది, అతని సహనానికి మరొక గొప్ప పరీక్షను ఎదుర్కుంటాడు.
అయితే, పరిస్థితులన్నీ అనుకూలంగా మారిపోతాయి, అక్కడున్న జైలు అధికారి అతనికి బాధ్యతను మరియు గౌరవమును ఇస్తాడు. అయితే ఫరో యొక్క గిన్నె అందించు వాడి కలకు అర్థం చెప్పిన అతని ద్వారా ఉపశమనం పొందబోతున్నానని అతను అనుకుంటున్నప్పుడు, గిన్నె అందించువాడు మరో రెండు సంవత్సరాలు అతన్ని మరచిపోతాడు. అతని సహనానికి మరో బాధాకరమైన పరీక్ష ఎదురయ్యింది.
చివరిగా, ఈ మలుపులుకు, ఆలస్యాలకు ఉన్న అర్థం స్పష్టమవుతుంది. ఫరో తర్వాత యోసేపు ఐగుప్తు నాయకుడిగా ఎదుగుతాడు. తనను బానిసగా అమ్మిన అన్నదమ్ముల ఆకలిని తీరుస్తాడు. “ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను.. . . . మీరు నాకు కీడుచేయనుద్దేశించితిరిగాని నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రదికించునట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను.” (ఆదికాండము 45:7; 50:20).
యోసేపు అమ్మబడి, ఎన్నో సంవత్సరాలుగా దుర్వినియోగానికి గురై, ఎంతో దుస్థితిని అనుభవించి, సహన౦ కలిగి ఉండటానికి కీలకాంశం ఏది? ఈ ప్రశ్నకు జవాబు: దేవుని సార్వభౌమాధికారం, భవిష్యత్తు కృపలో విశ్వాసం, అంటే ప్రణాళికలో లేనటువంటి ప్రదేశాన్ని మరియు ప్రణాళికలో లేనటువంటి గమనాన్ని సంతోషకరమైన ముగింపుగా మార్చడానికి దేవుని సార్వభౌమ కృపలో విశ్వాసం కలిగి ఉండడం.
అదే మన సహనానికి కూడా కీలకాంశం. మన జీవితాల్లోని విచిత్రమైన, బాధాకరమైన మలుపుల్లో దేవుడు మన కోస౦ పనిచేస్తున్నాడని మన౦ నమ్ముతున్నామా?