మనస్సాక్షిని శుద్ధి చేసే ఏకైక విషయం

మనస్సాక్షిని శుద్ధి చేసే ఏకైక విషయం

షేర్ చెయ్యండి:

“నిత్యుడగు ఆత్మ ద్వారా తన్నుతాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తుయొక్క రక్తము, నిర్జీవ క్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో యెక్కువగా శుద్ధిచేయును”. (హెబ్రీ 9:14)

ఇక్కడ మనం ఆధునిక యుగంలో ఉన్నాం, అంటే ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లు ఉన్నటువంటి, అంతరిక్ష ప్రయాణాలు చేస్తున్నటువంటి మరియు గుండె మార్పిడిలు జరుగుతున్నటువంటి యుగంలో ఉన్నాం. మన సమస్య ప్రాథమికంగా ఎప్పటిలాగే ఉంది, అదేంటంటే మన మనస్సాక్షి మనల్ని ఖండిస్తోంది మరియు మనం దేవునికి ఆమోదయోగ్యం కాదని భావించేలా చేస్తోంది. మనం దేవునికి దూరమయ్యాం. మన మనస్సాక్షి సాక్ష్యమిస్తోంది.

మన పిల్లలను పవిత్ర నదిలోకి విసిరేయడ౦, కోట్లాది రూపాయలను విరాళ౦గా ఇవ్వడ౦, లేదా ఆశ్రమాలలో సేవ చేయడ౦ ద్వారా మన౦ ప్రాయశ్చిత్త౦ చేసుకోవడానికి అనేక విధాలుగా ప్రయత్ని౦చవచ్చు కానీ ఇవేవీ ఆ మరకను తొలగించలేవు లేదా మరణ భయాన్ని తగ్గించలేవు.

మన మనస్సాక్షి అపవిత్రమైందని మనకు తెలుసు, అంటే శవాన్ని, మురికి డైపర్ని లేదా పంది మాంసపు ముక్కను తాకడంతో కలిగే బాహ్యపరమైన మలినం గురించి ఇక్కడ చెప్పడం లేదు. మనిషిని అపవిత్రం చేసేది మనిషి లోపలి  నుండి వచ్చేదే తప్ప లోపలికి వెళ్ళేది కాదని యేసు చెప్పాడు (మార్కు 7:15-23). అహంకారం, వ్యసనం, పగ, కామం, మత్సరం, అసూయ, అత్యాశ, ఉదాసీనత, భయం అనే ధోరణులవల్ల మనం అపవిత్రులమవుతాం.

ఇతర యుగాలలో ఉన్నట్లుగానే ఈ ఆధునిక యుగంలో ఉండే ఒకే ఒక జవాబు ఏమనగా క్రీస్తు రక్తమే. మీ మనస్సాక్షి మిమ్మల్ని గద్దించినప్పుడు, మీరు ఎక్కడికి వెళ్తారు? ఈ ప్రశ్నకు హెబ్రీ 9:14 జవాబు చెప్తోంది, “నిత్యుడగు ఆత్మద్వారా తన్నుతాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తుయొక్క రక్తము, నిర్జీవక్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో యెక్కువగా శుద్ధిచేయును.”

జవాబు ఏంటంటే క్రీస్తు రక్తము వద్దకు వెళ్ళండి. జీవితంలో ఉపశమనాన్ని, మరణంలో సమాధానాన్ని ఇచ్చే విశ్వంలో శుద్ధి చేసే ఏకైక ప్రతినిధి క్రీస్తు రక్తం వద్దకు వెళ్ళండి.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...