అయితే మనము నశించుటకు వెనుకతీయువారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై యున్నాము. (హెబ్రీ 10:39)

ప్రేమ కొరకు తాత్కాలికంగా చెల్లించాల్సిన వెలను చూసి దేవుని అనంతమైన సర్వోన్నత వాగ్దానాలు విశ్వసించే విషయంలో వెనక్కి తగ్గవద్దు. మీరు వెనక్కి తగ్గితే, వాగ్దానాలు కోల్పోవడమే కాదు; మీరు నాశనమవుతారు.

మనం వెనక్కి తగ్గుతామా లేక పట్టుదలగా ఉన్నామా అనేదాని బట్టి మనకు నరకం ఉందా లేదా అని నిర్ణయించబడుతుంది. ఇది కొన్ని అదనపు బహుమానాలను మాత్రమే కోల్పోవడం కాదు. హెబ్రీ 10:39 లో “వెనుకతీసి నశించడం” అని చెప్తున్నాడు. అదే దేవుని శాశ్వతమైన తీర్పు.

కాబట్టి, మనము ఒకరినొకరు హెచ్చరించుకోవాలి: దూరంగా వెళ్లవద్దు. లోకాన్ని ప్రేమించ వద్దు. పెద్ద ప్రమాదమేమీ లేదని ఆలోచించడం ప్రారంభించ వద్దు. పాపపు వాగ్దానాల కంటే దేవుని వాగ్దానాలను గౌరవించకుండా ఉంటే వచ్చే భయంకరమైన ఫలితాలకు భయపడండి. “పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠిన పరచబడ కుండునట్లు నేడు అనబడు సమయముండగానే, ప్రతిదినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదటనుండి మనకున్న దృఢ విశ్వాసము అంతముమట్టుకు గట్టిగా చేపట్టినయెడలనే క్రీస్తులో పాలివారమై యుందుము.” అని హెబ్రీ 3:14-15 చెప్తున్నాయి.

అయితే ప్రధానంగా, వాగ్ధానాలు ఎంత అమూల్యమైనవో అనే దానిపై మనం దృష్టి పెట్టాలి. క్రీస్తు మనకోసం పొందిన అపారమైన బహుమతిని గుర్తించడంలో ఒకరికొకరు మద్దతు ఇవ్వండి, దానిని అన్నింటికంటే విలువైనదిగా పరిగణించండి. హెబ్రీ 10:35 లో “కాబట్టి మీ ధైర్యమును విడిచి పెట్టకుడి; దానికి ప్రతి ఫలముగా గొప్ప బహుమానము కలుగును” అనే వాక్యాన్ని మనం ఒకరికొకరు తప్పక చెప్పుకోవాలి. బహుమానము గొప్పతనాన్ని చూడటానికి ఒకరికొకరు సహాయం చేసుకోవాలి.

అదే బోధ యొక్క ప్రధాన లక్ష్యం. క్రైస్తవ సంఘంలో చిన్న సమూహాలు (small groups) మరియు అన్నీ పరిచర్యల ప్రధాన ఉద్దేశ్యం: లోకము కంటే క్రీస్తు ఎంత విలువైనవాడో గ్రహించేలా చేయడం. అలా భావించే ప్రతి ఒక్కరి కొరకు క్రీస్తు కొనుగోలు చేసిన బహుమానం ఎంత గొప్పదో గ్రహించేలా ప్రజలకు సహాయం చేయడం. విశ్వాసులు దానిని చూసి ఆస్వాదించుట కొరకు సహాయం చేయడం. తద్వారా విశ్వాసులు క్రీస్తులో మరియు ఆయన బహుమానం విషయంలో సంతృప్తి చెందినపుడు అలాంటి హృదయాలలో నుండి వచ్చే త్యాగాలలో దేవుని అత్యున్నతమైన విలువ ప్రకాశిస్తుంది

జాన్ పైపర్
జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *