ప్రభువే సేవకుడు

ప్రభువే సేవకుడు

షేర్ చెయ్యండి:

“క్రీస్తుయేసునందు ఆయన మనకు చేసిన ఉపకారముద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనుపరచు నిమిత్తము”. . . (ఎఫెసీయులు 2:6)

క్రీస్తు రెండవ రాకడను గురించి బైబిల్ ఇచ్చే అత్యంత ఆశ్చర్యకరమైన చిత్రం లూకా 12:35-37లో ఉంది, ఇది వివాహ విందు నుండి యజమాని తిరిగి రావడాన్ని ఈ విధంగా చిత్రీకరిస్తుంది:

“మీ నడుములు కట్టుకొనియుండుడి, మీ దీపములు వెలుగుచుండనియ్యుడి. తమ ప్రభువు పెండ్లివిందునుండి వచ్చి తట్టగానే అతనికి తలుపుతీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతనికొరకు ఎదురుచూచు మనుష్యులవలె ఉండుడి. ప్రభువు వచ్చి యే దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు; అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి, తానే వచ్చి వారికి ఉపచారము చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.”

ఖచ్చితంగా చెప్పాలంటే, మనల్ని సేవకులు అంటారు – మరియు నిస్సందేహంగా మనము చెప్పింది చెప్పినట్లు ఖచ్చితంగా చేయాలని అర్థం. కానీ ఈ చిత్రం యొక్క అద్భుతం ఏమిటంటే “ప్రభువు” సేవ చేయాలని పట్టుబట్టారు. “మనుష్యకుమారుడు సేవ చేయించుకొనుటకు రాలేదు గాని సేవ చేయుటకు మరియు అనేకుల కొరకు విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చెను” అని మార్కు 10:45లో చెప్పాడు కాబట్టి యేసు భూమిమీద పరిచర్య చేసే సందర్భం గురించి ఈ వాక్యం మాట్లాడుతుందని మనం అనుకోవచ్చు. కానీ లూకా 12:35-37 రెండవ రాకడను గూర్చి మాట్లాడుతుంది. మనుష్యకుమారుడు కళ్ళు మినిమిట్లు గొలిపే  తన తండ్రి యొక్క మహిమతో “తన ప్రభావమును కనుపరచు దూతలతోకూడ పరలోకమునుండి అగ్నిజ్వాలలలో ” వస్తాడు అని 2 థెస్సలొనీకయులు 1:6 లో చెప్పబడింది. అయితే రెండవ రాకడలో యేసు సేవకుడుగా (టేబుల్ వెయిటర్‌గా) ఎందుకు చిత్రీకరించబడ్డాడు?

ఎందుకంటే ఆయన మహిమ యొక్క ప్రాముఖ్యత ఏదనగా అవసరాల్లో ఉన్న ప్రజల పట్ల దయ పొంగిపొర్లుతున్న ఆయన కృప యొక్క పరిపూర్ణతయే. అందుకే ఎఫెసీ 2:6, “క్రీస్తుయేసునందు ఆయన మనకు చేసిన ఉపకారముద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనుపరచునిమిత్తము”, లక్ష్యంగా పెట్టుకున్నాడు.

మన దేవుని గొప్పతనం ఏమిటి? ప్రపంచంలో ఆయన ప్రత్యేకత ఏమిటి? యెషయా సమాధానమిస్తున్నాడు: “తనకొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలముచేయు మరి ఏ దేవునిని ఎవడు నేకాలమున చూచియుండలేదు” (యెషయా 64: 4). ఇలాంటి దేవుడు మరొకడు లేడు. ఎప్పుడూ తనపై ఆధారపడిన, సంతోషంగా ఉన్న ప్రజల తరగని శ్రేయోభిలాషి పాత్రను ఆయన వదులుకోడు.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...