“పెండ్లికుమారుడు పెండ్లికూతురిని చూచి సంతోషించునట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును”. (యెషయా 62:5)
దేవుడు తన ప్రజలకు మేలు చేసినప్పుడు, అది నీచమైన నేరస్థుని పట్ల అయిష్టంగా ఉండే న్యాయమూర్తి కరుణ చూపడం లాంటిది కాదు. పెండ్లికుమారుడు తన వధువు పట్ల ఆప్యాయత చూపడం లాంటిది.
కొన్నిసార్లు మనం పెళ్లి గురించి సరదాగా ఇలా చెబుతాము, “హనీమూన్ ముగిసింది.” కానీ మనం పరిమితమైన వాళ్లం కాబట్టి అలా జరుగుతుంది. మనము హనీమూన్ తీవ్రతను మరియు ఆప్యాయత స్థాయిని అలాగే కొనసాగించలేము. అయితే దేవుడు తన ప్రజల పట్ల తనకున్న సంతోషం పెండ్లికుమారుడు పెండ్లికూతురిపై ఉండే సంతోషం లాంటిదని చెప్పాడు. మరియు అది అలా మొదలై ఆ తర్వాత మసకబారుతుందని ఆయన అర్థం కాదు.
ఆయన హనీమూన్ తీవ్రత, హనీమూన్ ఆనందాలు మరియు హనీమూన్ శక్తి, ఉత్సాహం, ఆవేశం మరియు ఆనందాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఆయన తన పూర్ణహృదయంతో మనపై సంతోషిస్తున్నాడని చెప్పినప్పుడు ఆయన మన హృదయాల్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నాడు అని దాని అర్ధం. యిర్మీయా 32:41, “వారికి మేలుచేయుటకు వారియందు ఆనందించుచున్నాను, నా పూర్ణహృదయముతోను నా పూర్ణాత్మతోను ఈ దేశములో నిశ్చయముగా వారిని నాటెదను.” జెఫన్యా 3:17, “నీ దేవుడైన యెహోవా నీమధ్య ఉన్నాడు; ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును, నీయందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీయందలి సంతోషముచేత ఆయన హర్షించును.”
దేవునితో హనీమూన్ ఎప్పటికీ అంతం కాదు. ఆయన శక్తి, జ్ఞానం మరియు సృజనాత్మకతలో అనంతమైనవాడు. తద్వారా తరువాతి లక్ష కోట్ల యుగాల సహస్రాబ్దాలకు కూడా విసుగు చెందడు.
Great explanation sir ,so tasty