ఉన్నతమైన ప్రేమ
“చిన్న పిల్లలారా, ఆయన నామముబట్టి మీ పాపములు క్షమింపబడినవి గనుక మీకు వ్రాయుచున్నాను.” (1 యోహాను 2:12)
“ఆయన నామమును బట్టి” – ఆయన మహిమ కొరకు దేవుడు ప్రేమిస్తాడు, క్షమిస్తాడు మరియు రక్షిస్తాడు అని ఎందుకు నొక్కి చెప్పాలి? చాలా కారణాలు ఉన్నప్పటికీ రెండు కారణాలను చూద్దాం.
1) దేవుడు తన మహిమ కొరకు మనలను ప్రేమిస్తాడు, క్షమిస్తాడు మరియు రక్షిస్తాడు అనే సత్యాన్ని మనం నొక్కి చెప్పాలి. ఎందుకంటే బైబిలు ఈ విషయాన్ని నొక్కి చెప్తుంది కాబట్టి.
నేను నేనే నా చిత్తానుసారముగా నీ యతిక్రమములను తుడిచివేయుచున్నాను నేను నీ పాపములను జ్ఞాపకము చేసికొనను (యెషయా 43:25)
యెహోవా, నా పాపము బహు ఘోరమైనది నీ నామమునుబట్టి దానిని క్షమింపుము. (కీర్తనలు 25:11)
మా రక్షణకర్తవగు దేవా, నీ నామప్రభావమునుబట్టి మాకు సహాయము చేయుము నీ నామమునుబట్టి మా పాపములను పరిహరించి మమ్మును రక్షింపుము. (కీర్తనలు 79:9)
మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి; నీ నామమునుబట్టి నీవే కార్యము జరిగించుము. (యిర్మియా 14:7)
యెహోవా, మా దుర్మార్గతను మా పితరుల దోషమును మేము ఒప్పుకొనుచున్నాము; నీకు విరోధముగా పాపము చేసియున్నాము. నీ నామమునుబట్టి మమ్మును త్రోసివేయకుము, ప్రశస్తమైన నీ సింహాసనమును అవమానపరచకుము. (యిర్మియా 14:20-21)
పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమివలన ఉపేక్షించినందున, ఆయన తన నీతిని కనువరచవలెనని క్రీస్తుయేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరచునిమిత్తము, తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసముగలవానిని నీతిమంతునిగా తీర్చువాడునై యుండుటకు ఆయన ఆలాగు చేసెను. (రోమా 3:25-26).
ఆయన నామముబట్టి మీ పాపములు క్షమింపబడినవి (1 యోహాను 2:12)
2) దేవుడు తన మహిమ కొరకు మనలను ప్రేమిస్తాడు మరియు క్షమిస్తాడు అనే సత్యాన్ని మనం నొక్కి చెప్పాలి. ఎందుకంటే అలా చెప్పడం ద్వారా దేవుడు ఉన్నతమైన ప్రేమతో మనలను ప్రేమిస్తున్నాడు అని అర్ధమవ్వుతుంది.
“తండ్రీ, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతోకూడ ఉండవలెననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియు కోరుచున్నాను.” (యోహాను 17:24)
దేవుని ప్రేమ మనల్ని ఉన్నతమైన వారిగా చూపించదు గాని దేవున్ని ఉన్నతమైనవానిగా చూపిస్తుంది. పరలోకం, మనల్ని మనం చూసుకునే అద్దాలతో నిండి ఉండే ప్రదేశం కాదు గానీ, అనంతమైన దేవుని గొప్పతనమును అర్ధం చేసుకునే స్థలం. పరలోకంకి వెళ్ళాక మనము చాలా గొప్పవారమని మనకు అనిపిస్తే దానంత నిరుత్సాహం మరొకటుండదు.
దేవుడు అన్నీ విషయాలలో తన ఆధిపత్యాన్ని పైకెత్తి అందరూ తన గురించి గొప్పగా చెప్పుకునే విధంగా ప్రతి కార్యమును చేయాలని ఉన్నతమైన ప్రేమ ఆశిస్తుంది. ఎందుకంటే తద్వారా పరలోకంలో మన ఆనందం ఎల్లప్పుడూ ఎక్కువ అవడానికి ఒక కారణం ఉంటుంది; అదే: దేవుని మహిమ. దేవుని అద్భుతమైన ప్రేమ ఏంటంటే తన కుమారుని ప్రాణ త్యాగం ద్వారా తనను తానే మన శాశ్వత ఆనందం కోసం ఇచ్చివేసుకున్నాడు (రోమా 8:32). దేవుడు తన నామమును బట్టి మనల్ని ప్రేమించడం, క్షమించడం అంటే అర్థం ఇదే.
జాన్ పైపర్
జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.
సంబంధిత ధ్యానాలు...
ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది
సంస్కరణ
"సంస్కరణ" వాట్సాప్ ఛానెల్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఫేస్బుక్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఇన్స్టాగ్రామ్
క్లిక్ చెయ్యండి👆🏿
చిరునామా:
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్:
9866436426, 9958799659, 9151519121
ఇమెయిల్:
samskarana2024@gmail.com
©Samskarana – Made with❤️by ABNY Web