గొప్ప మిషనరీ నిరీక్షణ

షేర్ చెయ్యండి:

“మనము మన అపరాధములచేత చచ్చినవారమై యుండినప్పుడు సయితము మనలను క్రీస్తుతోకూడ బ్రదికించెను. కృపచేత మీరు రక్షింపబడియున్నారు”. (ఎఫెసీ 2:4-5)

గొప్ప మిషనరీ నిరీక్షణ ఏమిటంటే, పరిశుద్ధాత్మ శక్తితో సువార్త బోధించబడినప్పుడు, మనిషి చేయలేనిది దేవుడు స్వయంగా చేస్తాడు: ఆయన రక్షించే విశ్వాసాన్ని సృష్టిస్తాడు. మనిషి పిలుపు చేయలేనిది దేవుని పిలుపు చేస్తుంది. ఇది చనిపోయినవారిని లేపుతుంది. ఇది ఆధ్యాత్మిక జీవాన్ని సృష్టిస్తుంది. ఇది సమాధిలో ఉన్న లాజరును యేసు “బయటికి రమ్మని” పిలిచినప్పుడు  చనిపోయిన వ్యక్తి లోబడి బయటకు వచ్చాడు కదా అటువంటి పిలుపు ఇది. ఈ పిలుపు జీవాన్ని సృష్టించడం ద్వారా విధేయతను సృష్టించింది (యోహాను 11:43). ఎవరైనా రక్షించబడేది అలాగే.

మన పిలుపుతో మనం ఎవరినైనా నిద్ర నుండి మేల్కొల్పగలము, కాని దేవుని పిలుపు లేనివాటిని ఉన్నవాటిగా  మారుస్తుంది (రోమా ​​4:17). దేవుని పిలుపు అన్ని ప్రతిఘటనలను అధిగమించగలదు కాబట్టి అది ఆపలేనటువంటిది. అది దేవుని ఉద్దేశం నెరవేర్చడంలో తప్పిపోకుండా ప్రభావవంతంగా పని చేస్తుంది – ఎంతగా అంటే, మనం మన విశ్వాసం ద్వారా మాత్రమే నీతిమంతులుగా తీర్చబడినప్పటికీ పౌలు ఇలా చెప్పగలడు, “[దేవుడు] ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను” (రోమా 8:30). 

మరో మాటలో చెప్పాలంటే, దేవుని పిలుపు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. అది ఒక వ్యక్తి నీతిమంతునిగా తీర్చబడటానికి అవసరమైన విశ్వాసాన్ని తప్పిపోకుండా సృష్టిస్తుంది. రోమా ​​8:30 ప్రకారం పిలువబడిన వారందరూ నీతిమంతులుగా తీర్చబడతారు. కానీ విశ్వాసం లేకుండా ఎవరూ నీతిమంతులుగా పరిగణించబడరు (రోమా 5:1). కాబట్టి దేవుని పిలుపు దాని ఉద్దేశాన్ని నెరవేర్చడంలో విఫలం కాదు. ఇది నీతిమంతులుగా తీర్చే విశ్వాసాన్ని ఏది ఆపాలని ప్రయత్నించిన సరే సృష్టించే తీరుతుంది. 

మనిషి చేయలేనిది అదే. అది అసాధ్యం. దేవుడు మాత్రమే రాతి హృదయాన్ని తీయగలడు (యెహెజ్కేలు 36:26). దేవుడు మాత్రమే ప్రజలను కుమారుని వైపుకు ఆకర్షించగలడు (యోహాను 6:44, 65). సువార్తకు శ్రద్ధ చూపేలా ఆత్మీయంగా చనిపోయిన హృదయాన్ని దేవుడు మాత్రమే తెరవగలడు (అపొస్తలుల కార్యములు 16:14). మంచి కాపరికి మాత్రమే తన గొఱ్ఱెలు తెలుసు, మరియు వారందరూ అనుసరించేలాగా బలమైన శక్తితో వాటిని పేరు పెట్టి పిలుస్తాడు – మరియు అవి ఎన్నటికీ నశించవు (యోహాను 10:3-4, 14).

దేవుని సార్వభౌమ కృప, యేసుక్రీస్తు సువార్త ద్వారా మానవులకు అసాధ్యమైనది చేయగలుగుతుంది. కాబట్టి ఆ కృపే గొప్ప మిషనరీ నిరీక్షణ.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...