ప్రేమ యొక్క గొప్ప ఆనందం
“తన శరీరమును ద్వేషించినవాడెవడును లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై యున్నాము గనుక అలాగే క్రీస్తుకూడ సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు”. (ఎఫెసీయులు 5:29-30)
ఆ చివరి మాటలను మరిచిపోవద్దు: “మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై యున్నాము.” ఇంతకు ముందు పౌలు చెప్పిన రెండు వచనాలను మరచిపోకండి. “మహిమగల సంఘముగాను ఆయన తనయెదుట దానిని నిలువబెట్టుకొనవలెనని” తన్ను తాను అప్పగించుకొనెను. కాబట్టి, క్రీస్తు తన ప్రజల పవిత్రతను, సౌందర్యమును మరియు సంతోషాన్ని వెంబడించడం ద్వారా తన ఆనందాన్ని వెంబడించాడని పౌలు రెండు విభిన్న మార్గాల్లో స్పష్టం చేశాడు.
క్రీస్తు మరియు ఆయన వధువు మధ్య ఐక్యత చాలా అన్యోన్యమైనది (“ఏక శరీరం”) కాబట్టి ఆమెకు ఏదైనా మేలు చేస్తే అది తనకు తాను చేసుకున్న మేలు అవుతుంది. ఈ వచనం యొక్క స్పష్టమైన అర్ధం ఏమిటంటే, ప్రభువు తన వధువును పోషించడానికి, సంరక్షించడానికి, పవిత్రపరచడానికి మరియు శుభ్రపరచడానికి ప్రేరేపించబడ్డాడు, ఎందుకంటే ఇందులో ఆయన తన ఆనందాన్ని పొందుతాడు.
కొన్ని నిర్వచనాల ప్రకారం, ఇది ప్రేమ కాదు. ప్రేమ, ముఖ్యంగా క్రీస్తులాంటి ప్రేమ, కల్వరి ప్రేమ స్వప్రయోజనం లేకుండా ఉండాలి. బైబిల్ లోని ఈ భాగానికి సంబంధించి ప్రేమ యొక్క అటువంటి దృక్పథాన్ని నేను ఎప్పుడూ చూడలేదు.
అయితే క్రీస్తు తన వధువు కోసం ఏమి చేస్తున్నాడో, దానిని ఈ వచనం స్పష్టంగా ప్రేమ అని పిలుస్తుంది: “పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలె క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి, . . . ” (ఎఫెసీయులకు 5:25). నీతిశాస్త్రము లేదా తత్వశాస్త్రం నుండి ప్రేమ యొక్క నిర్వచనాన్ని తీసుకురావడానికి బదులుగా వాక్యం ప్రకారం ప్రేమ అంటే ఏంటో ఎందుకు నిర్వచించకూడదు? ఈ వాక్యం ప్రకారం, ప్రేమ అనేది ప్రియమైనవారి పవిత్ర ఆనందంలో క్రీస్తు తన ఆనందాన్ని వెదకటం.
ప్రేమ నుండి స్వప్రయోజనమును వేరు చేయలేము. ఎందుకంటే స్వప్రయోజనము స్వార్థంతో సమానం కాదు. ఇతరులు నష్టపోయిన ఫరవాలేదు గాని తన స్వంత వ్యక్తిగత ఆనందాన్ని కోరుకోవడమే స్వార్థం.
క్రీస్తు ప్రేమ ఇతరుల దుఃఖంలో కాదు గాని వారి ఆనందంలో తన ఆనందాన్ని చూసుకుంటుంది. ఈ ప్రేమ ప్రియమైనవారి జీవితములో పరిశుద్ధతలో తన ఆనందం సంపూర్ణమవ్వడానికి శ్రమపడటానికి మరియు చనిపోవడానికి కూడా సిద్ధపడుతుంది.
క్రీస్తు మనలను ఇలాగే ప్రేమించాడు మరియు అలాగే ఒకరినొకరు ప్రేమించుకోవాలని ఆయన మనలను పిలుస్తున్నాడు.
జాన్ పైపర్
జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.
సంబంధిత ధ్యానాలు...
ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది
సంస్కరణ
"సంస్కరణ" వాట్సాప్ ఛానెల్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఫేస్బుక్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఇన్స్టాగ్రామ్
క్లిక్ చెయ్యండి👆🏿
చిరునామా:
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్:
9866436426, 9958799659, 9151519121
ఇమెయిల్:
samskarana2024@gmail.com
©Samskarana – Made with❤️by ABNY Web