గొప్ప మార్పిడి

గొప్ప మార్పిడి

షేర్ చెయ్యండి:

“సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసుదేశస్థునికి కూడ రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియై యున్నది. ఎందుకనిన నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంత కంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దానియందు బయలుపరచబడుచున్నది”. (రోమా 1:16-17)

దేవునికి ఆమోదయోగ్యంగా ఉండాలంటే మనకు నీతి అవసరం. కానీ మన దగ్గర అది లేదు. మనదగ్గర ఉన్నది ఏంటంటే  పాపం.

కాబట్టి, దేవుని దగ్గర మనకు అవసరమైనది మరియు మనము దేనికైతే అర్హులు కామో ఆ నీతి ఉంది; దేవుడు ద్వేషించే తిరస్కరించే పాపం మన దగ్గర ఉంది. ఈ పరిస్థితికి దేవుని పరిష్కారం ఏమిటి?

దేవుని సమాధానం ఏంటంటే మన స్థానంలో మరణించిన మరియు మన శిక్షను భరించిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తే. “దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను.” (రోమా 8:4). ఎవరి శరీరం శిక్షను భరించింది? యేసు శరీరం. ఎవరి పాపాలు శిక్షించబడ్డాయి? మన పాపాలు. ఇది గొప్ప మార్పిడి. 2 కొరింథీయులకు 5:21 లో ఇలా వ్రాయబడి ఉంది: “ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగాచేసెను.”

దేవుడు మన పాపాలను క్రీస్తుపై మోపి ఆయనలో వాటిని శిక్షించాడు. క్రీస్తు యొక్క విధేయతతో కూడిన మరణం ద్వారా, దేవుడు తన నీతిని నెరవేర్చాడు, నిరూపించుకున్నాడు మరియు దానిని మనకు ఆపాదించాడు (జమ చేయడం). మన పాపం క్రీస్తుకు, ఆయన నీతి మనకు ఆపాదించబడింది.

మన అతి పెద్ద సమస్యకు క్రీస్తే దేవుని సమాధానం అని మనం ఎంత చెప్పిన తక్కువే. క్రీస్తుకే మనము ఋణపడి ఉన్నాము.

మీరు క్రీస్తును ఎంత ప్రేమించిన తక్కువే. మీరు ఆయన గురించి ఎంత ఆలోచించినా తక్కువే లేదా ఆయనకు ఎంత  కృతజ్ఞతలు చెప్పిన తక్కువే లేదా ఆయనపై ఎంత ఆధారపడినా తక్కువే. మన క్షమాపణ, మనము నీతిమంతులుగా తీర్చబడటం, మన నీతి అంతా క్రీస్తులోనే ఉంది.

సువార్త అంటే ఇదే – మన పాపాలు క్రీస్తుపై వేయబడ్డాయి మరియు ఆయన నీతి మనపై వేయబడింది. ఈ గొప్ప మార్పిడి మనకు క్రియల ద్వారా కాదు, విశ్వాసం ద్వారా మాత్రమే మనది అయింది అనేది గొప్ప శుభవార్త. “మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియలవలన కలిగినదికాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు.” (ఎఫెసీయులకు 2:8-9).

మన భారాన్ని ఎత్తివేసే, ఆనందాన్నిచ్చే, బలాన్నిచ్చే గొప్ప శుభవార్త ఇదే.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...