క్రీస్తు ప్రేమ యొక్క లక్ష్యం

క్రీస్తు ప్రేమ యొక్క లక్ష్యం

షేర్ చెయ్యండి:

“తండ్రీ, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించినవారును నాతో కూడ ఉండవలెననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడకమునుపే నీవు నన్ను ప్రేమించితివి”. (యోహాను 17:24)

యేసును నమ్మిన విశ్వాసులందరు దేవునికి శ్రేష్టమైనవారు (మనం ఆయన వధువుగా ఉన్నాం). మన శ్రేష్టత మనకు దేవుడిగా ఉండకూడదన్నంతగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. 

దేవుడు మన ద్వారా ఎంతగానో చేయవచ్చు (ఆయన మనల్ని తన కుటుంబంలోకి దత్తత తీసుకుంటాడు!), కానీ ఆయన గొప్పతనాన్ని మనం ఆస్వాదించడానికి మనల్ని మనలో నుండి బయటకు వచ్చే విధంగా చేస్తాడు. 

మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఒకవేళ ఒక రోజు యేసు మీ ఇంటికి వచ్చి, మీ సోఫాలో కూర్చొని, “నేను నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాను” అని చెబితే, మిగిలిన రోజంతా ఆయనతో కలిసి సమయాన్ని గడపడానికి దేని మీద దృష్టిపెడతారు? 

ఎన్నో పాటలు, ఎన్నో ప్రసంగాలు మనల్ని తప్పుడు జవాబుతో వదిలిపెడతాయని నాకనిపిస్తోంది. మనం ప్రేమించబడుతున్నామనే తలంపు పదే పదే రావడం ద్వారా మన ఆనందం శిఖరం ఎక్కుతుందనే భావనని ఇవి కలిగిస్తాయి. “ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు!” “ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు!” వాస్తవానికి “నేను ప్రేమించబడ్డాను” అనే మాటలతో మనమేమి చెబుతున్నాం? మన ఉద్దేశం ఏమిటి? “ప్రేమించబడటం” అంటే ఏమిటి? 

రోజంతా యేసును చూస్తూ, “నీవు ఆశ్చర్యకరుడవు!” “నీవు ఆశ్చర్యకార్యములను చేయగలిగినవాడవు!” అని గొప్పగా చెప్పేదానిలో క్రీస్తును ఘనపరిచే అత్యంత ఆనందం, గొప్పతనం కనిపిస్తుంది కదా. 

  • ఆయన కఠినమైన ప్రశ్నకు జవాబునిస్తాడు, ఆయన జ్ఞానం అద్భుతం. 
  • ఆయన మలినమైనవారిని, కారుతున్న పుండ్లను సహితం తాకాడు, ఆయన కనికరం అద్భుతం. 
  • చనిపోయిన స్త్రీని ఆయన లేపాడు, ఆయన శక్తి అద్భుతం. 
  • మధ్యాహ్న కాలం తర్వాత జరిగే సంఘటనలను ఆయన ముందుగానే ఊహించాడు, ఆయనకున్న భవిష్యత్ జ్ఞానం అద్భుతం. 
  • భూకంపం జరిగే సమయంలోను ఆయన నిద్రించాడు, ఆయనకున్న భయంలేనితనం అద్భుతం. 
  • “అబ్రహాముకు ముందే నేను ఉన్నాను” (యోహాను 8:58) అని ఆయన అన్నాడు, ఆయన మాటలు అమోఘం.

మనము చూస్తున్న కార్యములకు ఆశ్చర్యపోతూ మధ్యాహ్నమంతా ఆయనతో కలిసి నడుస్తాం.  

ఆయన ద్వారా దహించబడకుండ, ఆయనను చూసి విస్మయం చెందడానికి ఆయన చేయగలిగిన దానిని అంతటిని మనకొరకు చేయడానికి (మనకొరకు తన ప్రాణం అర్పించడంతో సహితం) ఆయనకున్న తపనంత మనకొరకు ఆయన కలిగియున్న ప్రేమ కాదా? విమోచనం, ప్రాయశ్చిత్తం, క్షమాపణ, నీతిమంతులుగా తీర్పు తీర్చబడటం, సమాధానపడటం అనేవన్నీ జరగాలి. అవన్నీ ప్రేమ కార్యములే. 

అయితే, ఆ ప్రేమ కార్యాలుగా మార్చే ప్రేమ యొక్క లక్ష్యం ఏంటంటే మనం అతనితో ఉండటం, ఆయన అద్భుతమైన మహిమను చూసి, ఆశ్చర్యపోవడం. ఆ క్షణాలలో ఆయనలో దేవుడు మనకు ఏమైయున్నాడో అని చూసి ఆస్వాదిస్తూ మనలను మనం పరచిపోతాం.

అందుచేత, ప్రజలను క్రీస్తు ప్రేమ కార్యాల ద్వారా ఆయన ప్రేమ అనే లక్ష్యం వైపుకు నడిపించాలని నేను పాస్టర్లకు, బోధకులకు మనవి చేసుకుంటున్నాను. విమోచనం, ప్రాయశ్చిత్తం, క్షమాపణ, నీతిమంతులుగా తీర్పు తీర్చబడటం, సమాధానపడటం అనేవి క్రీస్తును ఆనందించేందుకు మనల్ని నడిపించకపోతే, అవి ప్రేమకు సంబంధించినవి కావు. 

ఈ విధంగా చేయడంలో విశేషమైన నిర్ధారణ కలిగియుండండి. యోహాను 17:24లో  యేసు ఈ విధంగానే ప్రార్థించాడు, ఒకసారి చూడండి,

“తండ్రీ, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించినవారును నాతోకూడ ఉండవలెననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడకమునుపే నీవు నన్ను ప్రేమించితివి.”

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...