ఇచ్చే వాడే మహిమను పొందుతాడు
“అందువలన మన దేవునియొక్కయు ప్రభువైన యేసు క్రీస్తు యొక్కయు కృపచొప్పున మీయందు మన ప్రభువైన యేసు నామమును, ఆయనయందు మీరును మహిమనొందునట్లు, మేలుచేయవలెనని మీలో కలుగు ప్రతి యాలోచనను, విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణముచేయుచు, మనదేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచునట్లు మీకొరకు ఎల్లప్పుడును ప్రార్థించుచున్నాము.” (2 థెస్స 1:11-12)
దేవుడు తన కృపను చూపించుట ద్వారా మహిమను పొందుట అనే విధానమును రూపకల్పన చేయడమనేది చాలా మంచి శుభవార్త.
ఖచ్చితంగా, దేవుడు తన ఉగ్రత శక్తి ద్వారా మహిమ పొందుతాడు (రోమా 9:22), అయితే మనం దేవుని కృపను అనుభవించుట ద్వారా దేవుడు మహిమ పొందుతాడని క్రొత్త నిబంధనలోని వాక్యాలు (మరియు పాత నిబంధన, ఉదాహరణ, యెషయా 30:18) పదేపదే చెబుతున్నాయి.
2 థెస్స. 1:11-12 వచనాలలో ఉన్నటువంటి ప్రార్థనలో ఇదెలా పని చేస్తుందో చూడండి. మనకున్న మంచి సంకల్పములన్నిటినీ దేవుడు నెరవేరుస్తాడని పౌలు ప్రార్థన చేస్తున్నాడు.
ఎలా? ; ఎలాగంటే, అవన్నీ “దేవుని శక్తి ద్వారా” నెరవేర్చబడతాయని పౌలు ప్రార్థిస్తున్నాడు. అవన్నీ “విశ్వాసానికి సంబంధించిన కార్యములు (పనులు).”
ఎందుకు? ; ఎందుకంటే, మనలో యేసు మహిమపరచబడాలి.
అంటే, ఇచ్చే వాడే మహిమను పొందుతాడు. దేవుడు శక్తిని ప్రసాదించాడు. దేవుడు మహిమను పొందుకుంటాడు. మనకు విశ్వాసమున్నది; ఆయన శక్తిని ప్రసాదిస్తాడు. మనం సహాయం పొందుకుంటాం; ఆయన మహిమను పొందుకుంటాడు.
ఈ విధానమే మనల్ని తగ్గింపు స్థితిలో, సంతోషములో ఉంచుతుంది మరియు దేవుణ్ణి సర్వాధికారిగాను, మహిమగల దేవునిగాను ఉంచుతుంది.
ఆ తర్వాత, ఈ విధంగా క్రీస్తు మహిమపరచబడడం అనేది “మన దేవుడు మరియు ప్రభువునైన యేసు యొక్క కృపను బట్టియే” అని పౌలు చెబుతున్నాడు
మంచి క్రియలు చేయడానికి దేవుని శక్తి మీద మనం ఆధారపడాలని పౌలు చేసిన ప్రార్థనకు దేవుని జవాబు ఏంటంటే కృప. మీ సంకల్పాన్ని జరిగించునట్లు మిమ్మల్ని బలపరచడానికి దేవుడు తన శక్తిని మీకు ప్రసాదించడమే కృప.
ఈ విధంగానే క్రొత్త నిబంధనలో పదేపదే జరిగింది. కృపగల బలం కోసం దేవుణ్ణి నమ్మండి, మీకు సహాయం వచ్చినప్పుడు ఆయన మహిమ పొందుతాడు.
మనం సహాయం పొందుతాం. ఆయన మహిమ పొందుతాడు.
అందుచేతనే, క్రైస్తవుడు మార్పు చెందడం మాత్రమే శుభవార్త కాదు గాని, క్రైస్తవ జీవితం జీవించడం అనేది శుభవార్త.
జాన్ పైపర్
జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.
సంబంధిత ధ్యానాలు...
ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది
సంస్కరణ
"సంస్కరణ" వాట్సాప్ ఛానెల్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఫేస్బుక్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఇన్స్టాగ్రామ్
క్లిక్ చెయ్యండి👆🏿
చిరునామా:
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్:
9866436426, 9958799659, 9151519121
ఇమెయిల్:
samskarana2024@gmail.com
©Samskarana – Made with❤️by ABNY Web