దేవుణ్ణి సేవించుటలో ఉన్న లాభం

షేర్ చెయ్యండి:

“అయితే నన్ను సేవించుటకును, భూరాజులకు దాసులై యుండుటకును ఎంత భేదమున్నదో వారు తెలిసికొనునట్లు వారు అతనికి దాసులగుదురు.” (2 దిన. 12:8) 

దేవుణ్ణి సేవించడానికి ఇతరులను సేవించడానికి మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది.

మనం దీనిని అర్థం చేసుకొని, ఆనందిస్తే దేవుడు ఎంతో రోషము కలిగి ఉంటాడు. ఉదాహరణకు, “సంతోషముతో  యెహోవాను సేవించుడి.

ఉత్సాహగానముచేయుచు ఆయన సన్నిధికి రండి!” (కీర్తన 100:2). ఈ సంతోషానికి ఒక కారణం ఉంది. ఆ కారణం అపొ. కార్య 17:25 వచనంలో ఇవ్వబడింది. “ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనను కొదువ యున్నట్టు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు.”

మనం దేవుణ్ణి సంతోషంతో సేవిస్తాం, ఎందుకంటే ఆయన అవసరాలు తీర్చే భారాన్ని మనం మోయలేం. ఆయనకు అవసరాలనేవే ఉండవు.

కాబట్టి, అతనికి సేవ చేయడం అంటే అతని అవసరాలను తీర్చడం కాదు గాని ఆయన మన అవసరాలను తీర్చే సేవలో మనం సంతోషంగా ఉంటాం. దేవుణ్ణి సేవించడమంటే మనం చేయవలసిన పనిని చేయడానికి ఎల్లప్పుడూ దేవుని కృపను పొందడమని అర్థం.

దీన్ని మనం అర్థం చేసుకోవడానికి, దానిలో మహిమను మనం చూడడానికి దేవుడు రోషము కలిగి ఎలా ఉంటాడో చూపించడానికి 2వ  దినవృత్తా౦తములు 12వ అధ్యాయంలో ఒక కథ ఉ౦ది. పది గోత్రాలు తిరుగుబాటు చేసిన తరువాత దక్షిణ రాజ్యాన్ని పరిపాలించిన సొలొమోను కుమారుడైన రెహబాము ప్రభువు సేవకు వ్యతిరేకంగా ఇతర దేవతలకు మరియు ఇతర రాజ్యాలకు తన సేవను అందించాడు.

దానికి తీర్పుగా, రెహబాముకు విరుద్ధంగా 1,200 రథములతో 60,000 గుఱ్ఱపు రౌతులతో దేవుడు ఐగుప్తు రాజైన షీషకును పంపించాడు (2 దిన. 12:2-3).

దేవుడు కరుణించి, “మీరు నన్ను విసర్జించితిరి గనుక నేను మిమ్మును షీషకు చేతిలో పడనిచ్చియున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు” (2 దిన. 12:5) అనే ఈ సందేశాన్ని ప్రవక్తయైన షెమయా ద్వారా రెహబాముకు పంపించాడు. ఆ సందేశానికి సంబంధించిన సంతోషకరమైన విషయం ఏంటంటే ఇశ్రాయేలీయుల అధిపతులును రాజును తమ్మును తాము తగ్గించుకొని “యెహోవా న్యాయస్థుడు” (2 దిన. 12:6) అని ఒప్పుకొనిరి.

వారు తమ్మును తాము తగ్గించుకోవడాన్ని యెహోవా చూసినప్పుడు, “వారు తమ్మును తాము తగ్గించుకొనుట యెహోవా చూచెను గనుక యెహోవా వాక్కు షెమయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను – వారు తమ్మును తాము తగ్గించుకొనిరి గనుక నేను వారిని నాశనముచేయక, షీషకు ద్వారా నా ఉగ్రతను యెరూషలేము మీద కుమ్మరింపక త్వరలోనే వారికి రక్షణ దయచేసెదను” (2 దిన. 12:7). “అయితే నన్ను సేవించుటకును, భూరాజులకు దాసులై యుండుటకును ఎంత భేదమున్నదో వారు తెలిసికొనునట్లు వారు అతనికి దాసులగుదురు” (2 దిన. 12:8) అని ఆయన వారిని క్రమశిక్షణ చేయుటకు చెప్పాడు.

ఇక్కడ విషయం చాలా స్పష్టంగా ఉంది, అదేమనగా శత్రువును సేవించడం మరియు దేవుని సేవించడమనేవి రెండు చాలా విభిన్నమైనవి. అవి ఎలా విభిన్నమైనవి? దేవుణ్ణి సేవించడమంటే ఒక ఆశీర్వాదం, ఒక ఆనందం, ఒక ప్రయోజనం. షీషకును సేవించడమంటే అలసట చెందడం, క్షీణించిపోవడం, బాధాకరం. దేవుడు ఇచ్చేవాడు. షీషకు తీసుకునేవాడు.

అందుకే ఆదివారం ఉదయం ఆరాధన, రోజువారీ విధేయతను చూపించే ఆరాధన అనేవి ఏదో భారంగా దేవునికి తిరిగి ఇచ్చేవి కావని, అవి దేవుని నుండి సంతోషంగా పొందుకునేవని నేను ఏంతో రోషముతో చెప్పుతున్నాను. అదే దేవుడు కోరుకునే నిజమైన సేవ. మీరు చేసే ప్రతి పనిలోనూ ఇచ్చేవాడిగా నన్ను నమ్మండి.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...