సువార్త ముగింపు

సువార్త ముగింపు

షేర్ చెయ్యండి:

“కాబట్టి ఆయన రక్తమువలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతనుండి రక్షింప బడుదుము. ఏలయనగా శత్రువులమై యుండగా, ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన యెడల సమాధానపరచబడిన వారమై, ఆయన జీవించుటచేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. అంతేకాదు; మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా మనము దేవునియందు అతిశయపడుచున్నాము; ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధానస్థితి పొంది యున్నాము”. (రోమా 5:9–11)

మనం దేని నుండి రక్షించబడాలి? 9వ వచనం దానిని స్పష్టంగా తెలియజేస్తుంది: దేవుని ఉగ్రత. ” కాబట్టి ఆయన రక్తమువలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతనుండి రక్షింపబడుదుము.” అయితే ఇది సువార్త యొక్క అత్యున్నతమైన, ఉత్తమమైన, సంపూర్ణమైన, అత్యంత సంతృప్తికరమైన బహుమానమా?

కాదు. 10వ వచనం ఇలా చెబుతోంది “ఏలయనగా. . . ఆయన జీవించుటచేత మరి నిశ్చయముగా రక్షింప బడుదుము”.  తర్వాత 11వ వచనం దానిని సువార్త యొక్క ముగింపు మరియు లక్ష్యం వరకు తీసుకువెళుతుంది: ” అంతేకాదు. . . మనము దేవునియందు అతిశయపడుచున్నాము.”

అదే సువార్తలోని అంతిమ మరియు అత్యున్నతమైన శుభవార్త. ఆ తర్వాత “అంతకు మించి” మరొకటి లేదు. “మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా. . . ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధానస్థితి పొంది యున్నాము.” అని పౌలు చెప్పిన మాట మాత్రమే ఉంది.

“మనము దేవునియందు అతిశయపడుచున్నాము అనేది సువార్త యొక్క ముగింపు.” దేవుడే, సువార్త యొక్క అత్యున్నతమైన, సంపూర్ణమైన, లోతైన, మధురమైన వ్యక్తి మరియు విమోచించిన ప్రజలు ఆయనను బట్టి ఆనందిస్తారు.

క్రీస్తులో దేవుడు బలి అయ్యాడు (రోమా 5:6-8), మరియు క్రీస్తులో దేవుడు బహుమానం అయ్యాడు (రోమా 5:11).

దేవుడు మనకొరకు కొన్న దేవుని పట్ల ఉండాల్సిన నిత్య సంతోషమే సువార్త.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...