ఆ దినము సమీపంగా ఉంది

ఆ దినము సమీపంగా ఉంది

షేర్ చెయ్యండి:

“రాత్రి చాలా గడచి పగలు సమీపముగా ఉన్నది”. (రోమ 13:12)

కష్టాల్లో ఉన్న క్రైస్తవులకు ఇది నిరీక్షణ నిచ్చే మాట. తమ పాపాన్ని ద్వేషించి దానికి దూరంగా ఉండాలని కోరుకునే క్రైస్తవులకు ఇది ఆశను దయచేసే వాక్యం. ఆఖరి శత్రువైన మరణాన్ని జయించాలని దానిని అగ్నిగుండములో పడవేయాలని కోరుకునే క్రైస్తవులకు ఇది నిరీక్షణనిచ్చే మాట (ప్రకటన 20:14).

పై వాక్యం ఎలా వీటన్నింటికి ఆశాజనకంగా ఉంది?

“రాత్రి” అనేది ఈ చీకటి యుగాన్ని, పాపమును, దుఃఖమును మరియు మరణాన్ని సూచిస్తుంది. దాని గురించి పౌలు ఏమి చెప్పాడు? “రాత్రి చాలా గడచిపోయింది”. పాపం, దుఃఖం మరియు మరణం ఉన్న ఆ యుగం దాదాపుగా గడిచిపోయింది. నీతి, శాంతి మరియు సంపూర్ణ ఆనందం వచ్చే రోజు ఉదయిస్తోంది.

మీరు ఇలా అనవచ్చు, “2,000 సంవత్సరాలు కూడా సుదీర్ఘమైన తెల్లవారుజాములా అనిపిస్తుంది.” ఒక దృక్పథం నుండి ఆలోచిస్తే ఇది నిజం. ఎంతకాలం ఓ ప్రభువా, ఎంతకాలం మీరు దానిని కొనసాగిస్తున్నారు? అని మనము ఏడుస్తాము కానీ బైబిల్ ప్రకారం ఆలోచిస్తే అది “ఎంత కాలం!” అనే ఈ విలాపానికి మించినది. ఇది ప్రపంచ చరిత్రను భిన్నంగా చూస్తుంది.

ప్రధాన వ్యత్యాసం ఏమిటంటే, “పగలు” – మెస్సీయ యొక్క కొత్త యుగం – నిజంగా యేసు క్రీస్తులో ఉదయించింది. యేసే ఈ పతనమైన యుగానికి ముగింపు. అంటే, ఈ పతనమైన యుగం యొక్క ముగింపు, ఈ ప్రపంచాన్ని విచ్చిన్నం చేస్తూ వచ్చింది. యేసు చనిపోయి తిరిగి లేచినప్పుడు పాపం, దుఃఖం, మరణం మరియు సాతానులను ఓడించాడు. యుగాల నిర్ణయాత్మక యుద్ధం ముగిసింది. దేవుని రాజ్యం వచ్చింది. నిత్య జీవం వచ్చింది.

మరియు తెల్లవారుజాము సంభవించినప్పుడు – యేసు మొదటి రాకడలాగే – ఆ రోజు రాకడను ఎవరూ అనుమానించకూడదు. తెల్లవారుజాము, 2000 సంవత్సరాలు గడిచిన తరువాత వచ్చిన కూడా అనుమానించకూడదు. 2 పేతురు 3:8లో పేతురు చెప్పినట్లు, “ప్రియులారా, ఒక సంగతి మరిచిపోకుడి. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరముల వలెను వెయ్యి సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి.” తెల్లవారింది. రోజు రానే వచ్చింది. పగటిపూట సూర్యుడు ఉదయించడాన్ని ఏదీ ఆపదు.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...